చలికాలంలో ఎదుర్కొనే ఐదు రకాల సమస్యలు……

ఈ చలి కాలం లో అందరూ ఎదుర్కొంటున్న సమస్యకు పంచసూత్రలు. మొదటిది చలికాలంలో స్కిన్ డ్రైగా అయిపోతుంది. దీనికి మాయిశ్చరైజింగ్ క్రీములు రాస్తూ ఉంటారు. అలా కాకుండా స్నానానికి వెళ్లేముందు కొబ్బరి నూనె ఒళ్లంతా రాసుకోవాలి. స్నానం చేసేటప్పుడు సబ్బు పెట్టి రుద్దుకోకుండా ఒక మెత్తని టవల్ తీసుకుని నీటిలో తడిపి ఒళ్లంతా రుద్దుకోవాలి ఇలా చేస్తే ఆయిల్ లోపలికి వెళ్లి డ్రైనేస్ రాకుండా, చర్మం మీద గీతలు రాకుండా చేస్తుంది. రెండవది సాధారణంగా చలికాలంలో పెదాలు పగిలిపోతూ ఉంటాయి. అంతేకాకుండా పెదాలు మండుతూ ఉంటాయి. దీనికి చాలామంది చాలా రకాల క్రీములు రాస్తూ ఉంటారు.

చలికాలంలో న్యాచురల్ గా పెదాలు పగలడం తగ్గాలంటే పేరుకుని ఉన్న నెయ్యిని తీసుకుని పెదాల మీద రాస్తూ ఉంటే మంచిగా, స్మూత్ గా, పగుళ్లు లేకుండా చేస్తాయి. మూడవది చలికాలం జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం తల స్నానం చేసేటప్పుడు వేడివేడి నీళ్లను తలమీద పోసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా వేడి నీళ్లతో తల స్నానం చేయడం వల్ల చర్మంలో కణజాలంలో ఆయిల్ గ్రంధులులో తగ్గిపోయి జిగురుని ఉత్పత్తి చేయడం తగ్గిపోతుంది. దీని వల్ల చుట్టూ ఊడిపోతుంది. అలా కాకుండా ఈ వేడినీళ్లకు బదులుగా గోరువెచ్చని నీళ్లను తల స్నానం చేసేటప్పుడు పోసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.

ఇక నాలుగవది తీసుకుంటే చలికాలంలో ఎక్కువగా మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఉదయం 9 గంటల అయినా సరే చలి బాగా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జలుబులు డబ్బులు ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు ఎదురవుతాయి. స్కిన్ పగిలిపోవడం చెవులు పోటు రావడం లాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అందుకని బండి మీద వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఫుల్ హెల్మెట్ ధరించి వెళ్లాలి. ఇలా చేస్తే చల్లగాలి అనేది లోపలికి వెళ్లకుండా రక్షిస్తుంది. కాబట్టి మంచులో వెళ్లేటప్పుడు ఈ హెల్మెట్ చాలా కాపాడుతుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయట పని చేసుకున్న లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు చేతులకు వణుకు పుడుతూ ఉంటుంది.

ఈ సమస్యను అధిగమించాలి అంటే చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. ఇది మోటార్ సైకిల్ మీద వెళ్లే వాళ్లకి చాలా బాగా ఉపయోగపడుతుంది. బాగా చలి ఎక్కువగా ఉన్నప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకుని తలకు మఫ్లర్ కట్టుకుంటే రగ్గు కంటే ఇది చలి నుండి బాగా రక్షిస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top