చదువులు ఆయిపోయి ఉద్యోగాలు వచ్చాక లేక చదువు పూర్తయ్యాక పిల్లల జీవితం ఇక సెటిల్ అవ్వాలి అనుకుంటూ పెద్దలు చేసేది పెళ్లి. ఆడా మగా ఇలా ఇద్దరికి ఇది సహజం అయినా అడవాళ్ళలో పెళ్లి అనేది ఎన్నో మార్పులను తెస్తుంది. మగవాడు మానసికంగా మారితే ఆడవాళ్లు శారీరకంగా మారతారు. పెళ్లయ్యాక 80%మంది అమ్మాయిలు శారీరకంగా చాలా మారిపోతున్నారు. ఇంతకు ఈ మార్పులు ఎందువల్ల ఒకసారి పరిశీలిస్తే….
◆ పెళ్లి అనేది ఇద్దరి మనసుల కలయిక మాత్రమే కాదు, రెండు దేహాలు కలయిక కూడా లైంగిక కారణాలు కూడా అమ్మాయిలలో శారీరక మార్పుకు కారణమవుతాయి. అయితే ఇది కేవలం చాలా తక్కువ కారణం. ఇంతకంటే పెద్ద కారణాలు ఉన్నాయి అవి కూడా చూడండి.
◆ ఆహారంలో అలవాట్లు మారిపోవడం. అమ్మాయి తన పుట్టింటిలో ఉండే ఆహారపు అలవాట్లను ఒక్కసారి మార్చుకోవలసి ఉంటుంది పెళ్లవగానే. అది తప్పనిసరి అని అత్తగారింట్లో ఎవరూ చెప్పకపోయినా అత్తగారింట్లో కుటుంబసభ్యులందరి అభిరుచి మేరకు వండే పదార్థాలను తను కూడా తినాల్సి రావడం, ఆహారంలో తీసుకునే ఉప్పు, కారం, పులుపు వంటి రుచులు కూడా కాసింత అస్తవ్యస్తం అవ్వడం కారణంగా చెప్పవచ్చు. అలాగే కొత్తగా పెళ్లయ్యాక అమ్మాయి తనకొచ్చిన మంచి వంటలు చేసి భర్తకు తినిపించాలని అనుకోవడం. ఇద్దరి మధ్య ప్రేమ ఆప్యాయత వల్ల ఒకరికి ఒకరు తినిపించుకోవడం. ముఖ్యంగా తీపి పదార్థాలు ఎక్కువగా తినడం కూడా అమ్మాయిలు లావు అవ్వడానికి కారణం. ఇంకా కొత్తగా పెళ్లయిన జంట అయితే వీకెండ్స్ లో బయటకు వెళ్లడం జంక్ ఫుడ్ లు, నూనెలో ఎక్కువ వేపిన పదార్థాలు, బేక్ చేసిన పదార్థాలు ఇలాంటి ఫ్యాట్ ఉన్న పదార్థాలు తినడం వల్ల కూడా లావు అవుతారు.
◆ మరొక కారణం ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం. నిద్రలేమి కారణంగా పగటి నిద్ర లావు అవ్వడానికి కారణం అవుతుంది. దానికి తోడు ఇంటి పనులు అన్ని ముగించుకునేసరికి అలసట వల్ల కూడా నిద్ర పోవడం ఎక్కువ అవుతుంది. దీనివల్ల రోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఎప్పటిలా చేసే కాసింత వ్యాయామాలు కూడా కుంటుపడతాయి.
◆ వాతావరణ మార్పులు కూడా మనిషి లావు అవ్వడానికి ఒక కారణం. అన్ని రోజులు ఒక వాతావరణంలో గడిపినిన వాళ్లకు ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోవడం, గాలిలో తేమ, సాంద్రత వంటివి కూడా ప్రభావితం చూపిస్తాయి. దీనివల్ల లావు అవుతారు.
◆గర్భం దాల్చడం ముఖ్యమైన పెద్ద కారణంగా చెప్పచ్చ. గర్భం దాల్చడం వల్ల శారీరకంగా మార్పులు చోటు చేసుకుంటాయి శరీరంలో రక్త ప్రసరణ, హార్మోన్ల అసమతుల్యత, తీసుకునే ఆహారం లో మార్పులు, ఇంకా చెప్పాలి అంటే కడుపులో పెరుగుతున్న బిడ్డకోసం అదనపు ఆహారం తీసుకోమని పెద్దలు చెప్పడం వల్ల కాసింత ఎక్కువగా తినడం ఇవన్నీ కూడా కారణం అవుతాయి.
◆ ఆడపిల్లకు పెళ్లయ్యాక ఒక ఇంటి కోడలు అనే బాధ్యత ఎక్కువ ఒత్తిడి చూపెడుతుంది దీనివల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల ఎమోషన్ లో ఎక్కువ తినేయడం వంటి సంఘటనలు వల్ల అమ్మాయిలు లావవుతారు. అలాగే వండిన ఆహారం ఇంట్లో వారు సరిగా తినకపోయినా వృధా అయిపోతుందని ఆలోచనతో ఎక్కువ తినేయడం కూడా ఒక కారణం.
చివరగా…….
పెళ్లైనంత మాత్రాన అది కేవలం ఒక సంఘటనగా తీసుకుంటూ మన రోజువారీ జీవితాన్ని ముందులాగే బ్యాలెన్స్ చేసుకుంటూ వీలైనంత యోగా, ధ్యానం వంటివి రోజు ఆచరించడం వల్ల ఈ పెళ్లయ్యాక బరువు పెరగడం అనే సమస్యను తగ్గించుకోవచ్చు.