ఇది ఒకే ఒక్కసారి రాస్తే తెల్ల వెంట్రుకలు ఒక్కటి కూడా ఉండదు

ఇప్పుడు వయస్సుతో  సంబంధం లేకుండా చిన్న వయసు వారికి కూడా  తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. తల వెంట్రుకలతో బయటకు వెళ్ళడానికి నలుగురిలో తిరగడానికి ఇబ్బందిగా అనిపించి కెమికల్స్ ఉన్న రంగులను వేసుకుంటున్నారు.  కెమికల్స్ ఉండే రంగులను వాడటం వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈజీగా ఇంట్లోనే  నాచురల్ చిట్కాతో తెల్ల వెంట్రుకలు నల్లగా  మార్చుకోవచ్చు.ఈ చిట్కా  ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ ప్యాక్ ఒక్కసారి అప్లై చేసేసరికి తెల్ల వెంట్రుకలు జుట్టు నల్లగా అవుతుంది.  ఈ ప్యాక్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ఇనుప కడాయిని తీసుకుని ఒక కప్పు హెన్నా పౌడర్ వేసుకోవాలి.  గోరువెచ్చటి నీళ్లతో హెన్నా పౌడర్ కలుపుకోవాలి. బాగా పలుచగా కాకుండా గట్టిగా కాకుండా ఉండేలా చూసుకోవాలి.కొంతమంది టీ డికాక్షన్ లేదా కాఫీ డికాక్షన్ తో కలుపుతారు. ఇక్కడ మనం గోరువెచ్చటి నీళ్లు మాత్రమే ఉపయోగిస్తున్నాము. హెన్నా పౌడర్ ఉపయోగించడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి.

దురద, చుండ్రు వంటివి కూడా తగ్గుతాయి. హెన్నా పౌడర్ ఉపయోగించడం వలన జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. ఇలా కలిపిన హెన్నా నైట్ అంతా అలా వదిలేయాలి. టైం లేదు అనుకున్న వాళ్లు కనీసం రెండు గంటలైనా నాననివ్వాలి. రాత్రంతా అలా వదిలేయడం  వలన హెన్నా నలుపు  రంగులోకి మారుతుంది.  దీనిని ఒకసారి  మరల కలుపుకోవాలి. అది పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు హెన్నా   పౌడర్ కి నాలుగు కప్పుల ఇండిగో పౌడర్ తీసుకొని గోరువెచ్చని నీళ్లతో బాగా కలుపుకోవాలి.

ఇండిగో పౌడర్ నాచురల్ గా జుట్టు నల్లగా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇండిగో పౌడర్ జుట్టు నల్లగా చేయడమే కాకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. ఇండిగో పౌడర్ ను రెగ్యులర్ గా యూస్ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ముందుగా కలిపి పెట్టుకొన్న హెన్నా పౌడర్ లో ఇండిగో పౌడర్ ఫేస్ట్ కూడా వేసి బాగా కలుపుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టి ఉంచడం వలన  మిశ్రమం నలుపు రంగులోకి మారుతుంది.

ఈ ప్యాక్ జుట్టు కుదుళ్ళ నుండి చివరి వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత షవర్ క్యాప్ లేదా పాలిథిన్ కవర్ తో కవర్ చేసుకోవాలి. అలా మూడు నుంచి నాలుగు గంటల పాటు ఉంచి తరువాత గోరు వెచ్చటి నీళ్లతో ఎటువంటి షాంపు యూస్ చేయకుండా  వాష్ చేసుకోవాలి. ఇలా నెలకు ఒకసారి చేసినట్లయితే జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా ఉంటుంది. జుట్టు రాలడం, చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇది ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top