పులిసినవి తింటే మనకు నిజంగా లాభమేనా……. సంచలన రహస్యం……

పులిసిన ఆహార పదార్థాలు మనకు మేలు చేస్తాయా అనే విషయం గురించి ఇవాళ ప్రత్యేకంగా తెలుసుకుందాం. మనకు ఇడ్లీ పిండి, దోసెల పిండి పులియబెట్టి వేసుకోవడం అలవాటు. అంతేకాకుండా చల్లపునుకులకు, ఊతప్పం వంటి వాటికి కూడా పిండిని పులియపెట్టి ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా చాలా చూస్తూ ఉంటాం. ఇలా పులియడం అనేది మనకు ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది, అతిగా పులియడం వలన మనకు ఏ విధంగా ఆరోగ్యానికి నష్టం కలుగజేస్తుంది. అసలు ఇవి ఎందుకు పులుస్తాయి, పులిసినప్పుడు ఇందులో ఎటువంటివి రిలీజ్ అవుతాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మనం తినే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ తో గాలిలో ఉండే బ్యాక్టీరియా చేరి కార్బోహైడ్రేట్స్ బ్యాక్టీరియాలు తమకు కావలసిన విధంగా మార్చుకొని వాటి నుంచి అవి శక్తిని విడుదల చేసి అవి బ్రతుకుతాయి. ఈ సమయంలో కొంత వ్యర్ధాలు రిలీజ్ అవుతాయి. ఇలా వ్యర్ధాలు రిలీజ్ అయినప్పుడు అవి ఏ రూపంలో ఎలా ఉంటాయని ఆలోచిస్తే మొదటిగా బ్యాక్టీరియాలు శక్తిగా కార్బోహైడ్రేట్స్ మార్చినప్పుడు విడుదల చేసే వేస్ట్ లో ఆల్కహాల్, రెండు గ్లిజరాల్, మూడు కార్బన్ డై ఆక్సైడ్, నాలుగు లాక్టిక్ యాసిడ్, ఐదు సిట్రిక్ యాసిడ్, ఆరు కొన్ని విటమిన్స్.

ఇవన్నీ ఇలా పులిసినప్పుడు తయారవుతాయి. కార్బోహైడ్రేట్స్ లో బ్యాక్టీరియాల్ చేరి వాటికి కావాల్సిన విధంగా మార్చుకున్నప్పుడు ఇలా మార్చుకునేటప్పుడు విడుదలయ్యె వ్యర్థ పదార్థాలు ఇవన్నీ. ఇలా పులిసిన వాటి వల్ల లాభం కలిగే వాటిని మన శరీరం ఉపయోగించుకుంటుంది. అంతేకాకుండా కొన్ని నష్టాలు కలిగించే వాటిని కూడా అందించినట్లు అవుతుంది. ఇలా పులిసిన వాటి వలన కొన్ని ఉపయోగ పడే బాక్టీరియాలు రిలీజ్ అవుతాయి. ఇలా ఇడ్లీ పిండిని, పెరుగు వంటి వాటిని ఒక అయిదారు గంటల వరకు పులియబెడితే ఎటువంటి నష్టం ఉండదు.

ఇందులో రిలీజ్ అయ్యే యాసిడ్స్ పేగులలో ఫ్రెండ్లీ బ్యాక్టీరియా తయారవ్వడానికి ఉపయోగపడతాయి. అలాగే కొన్ని విటమిన్స్ అందించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇలాంటి వాటిని అతిగా నిల్వ చేస్తే వీటి వలన అతిగా పులుసు పోతాయి. పులిసిన టెస్ట్ తెలియకపోయినా లోపల కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఇది మంచి ప్రక్రియ కాదు. దీని వలన హాని ఎక్కువగా జరుగుతుంది. పేగులలో బ్యాడ్ బ్యాక్టీరియా రిలీజ్ అవ్వడం, అల్సర్స్ రావడం, గ్యాస్ ప్రాబ్లం వస్తాయి. అందువలన అతిగా ఉండడం ఇలాంటి వాటిలో మంచిది కాదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top