చేపల కూర అంటే చాలా మంది లొట్టలేసుకుంటూ తింటారు. చికెన్ మటన్ కంటే కూడా కొంతమంది చేపలను బాగా ఇష్టపడతారు అలాగే కొంతమంది చేప తల భాగాన్ని ఇష్టంగా తింటే మరి కొంతమంది అసలు ఇష్టపడదు. చేపలు తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది ఈరోజు తెలుసుకుందాం. చేప తో పాటు చేప తల భాగాన్ని తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా. చేపల్లో గానీ చేపతల భాగంలో గానీ ప్రోటీన్, క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఎంతో ముఖ్యమైన పోషకాలతో పుష్కలంగ నిండి ఉంటాయి.
అంతేకాదు జింక్, అయోడిన్, ఐరన్ ముఖ్యమైన ఖనిజాలు కూడా లభిస్తాయి. మహిళలకు కావల్సిన ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చేప తల తినడం వల్ల గుండెకు సంబంధించిన అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. శరీరంలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ 30 శాతం వరకు తగ్గుతాయి. దీని వలన కొవ్వు పేరుకుపోయే పరిస్థితులు తగ్గుతాయి. రక్తనాళాల్లో కొవ్వు తగ్గడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండె వ్యాధులతో బాధపడేవారు.
వారంలో రెండు మూడు సార్లు చేపలు తినాలి. చికెన్, మటన్ తో పోలిస్తే చేపల్లో ఉండే omega 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి చాలా మంచిది. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి, కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాధులను దూరంగా ఉంచుతుంది. మెదడులో ఉండే బూడిదరంగు పదార్థం జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మెదడు సంబంధించిన ప్రమాదాలను అరికట్టడం లో సహాయపడుతుంది. చేపలు డిప్రెషన్ తగ్గించడంలో కూడా తోడ్పడతాయి. ఫిష్ ఆయిల్ డిప్రెషన్ అరికట్టడంలో సహాయపడుతుంది.
ఆందోళన లేదా డిప్రెషన్లో ఉన్నప్పుడు చేపలు తింటే రిలీఫ్ ఉంటుంది. హార్మోన్లు బ్యాలెన్స్ వలన వచ్చే మూడ్ స్వింగ్ తో పోరాడడానికి చేపలు సహాయపడతాయి. నిద్రలేమి సమస్యను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రెండు, మూడు సార్లు చేపలు తినడం వల్ల మంచి నిద్ర సొంతమవుతుంది. మీ చర్మం కాంతివంతంగా అందంగా తయారవుతుంది. ఏకాగ్రత పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఒకటి నుండి మూడు రోజుల వరకు క్రమం తప్పకుండా చేపలు తినడం రోగ నిరోధకశక్తి బలపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ అరికట్టే లక్షణాలు అధికం.
చేప తల భాగంలో ప్రోటీన్ తో పాటు విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది సూర్య కాంతి ద్వారా మనకు లభించే విటమిన్ డి కి సమానం. అధిక బరువు పొట్ట చుట్టూ కొవ్వు తో బాధ పడుతున్నారు కదా. అలాంటి వారు చికెన్ కంటే చేపలు తినడం మంచిది. ఎక్కువగా తినే వారిలో క్యాన్సర్ కారకాలు నశిస్తాయి. చేప తల ఎక్కువగా తినేవారిలో పెద్దపేగు క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. వీలైనంత వరకు ఎక్కువ నూనెలలో కాకుండా తక్కువ నూనె లో ఉడికించి తినడం మంచిది.