ప్రస్తుత కాలంలో అందరికీ పొట్ట పెరగడం అధిక బరువు సమస్య బాగా ఎక్కువగా ఉంది. ఈ సమస్య తగ్గించుకోవడానికి మార్కెట్లో రకరకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించడం వల్ల తాత్కాలిక పరిష్కారమే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. నాచురల్ చిట్కాలను ఉపయోగించి సరైన ఆహార నియమాలు, వ్యాయామం చేస్తూ అధిక బరువు సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చు. మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ డ్రింక్ తయారు చేసుకొని తాగినట్లయితే శరీరంలో అధిక బరువు, కొలెస్ట్రాల్, తొడల దగ్గర కొవ్వు వంటి సమస్యలు తగ్గుతాయి.
వీటిని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కలోంజి విత్తనాలు, అల్లం, దాల్చిన చెక్క. కలోంజీ విత్తనాలు శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పని చేస్తాయి. అధిక బరువు సమస్యను తగ్గిస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన మలబద్దకం సమస్యను కూడా తగ్గించడంలో సహాయపడతాయి. కలోంజీ విత్తనాలు జుట్టు రాలడం తగ్గించడంలో కూడా సహాయపడతాయి. వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోకూడదు.
స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్లు వేసుకోవాలి. తర్వాత దీంట్లో అరచెంచా కలోంజి విత్తనాలు వేసుకోవాలి. తర్వాత చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అల్లం అధిక బరువు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది.శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కూడా కలిగిస్తుంది. ఒక అంగుళం దాల్చిన చెక్కను పొడి చేసి వేసుకోవాలి. దాల్చిన చెక్క పొడి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే జీర్ణసంబంధ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా తగ్గించి ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
ఆహార మొత్తం జీర్ణం అవ్వడం వల్ల శరీరంలోని కొవ్వు పేరుకోవడం జరుగదు. ఐదు నిమిషాలు ఈ నీటిని మరిగించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి నీటిని వడకట్టుకోవాలి. దీనిలో అర చెంచా తేనె కలిపి రోజు ఉదయాన్నే పరగడుపున లేదా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అరగంట ముందు తీసుకోవాలి. తేనె కలపడం వలన విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. వరుసగా ఒక వారం రోజులపాటు తాగడం వల్ల అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు. డ్రింక్ తాగుతూ ఆహార నియమాలను పాటిస్తూ వ్యాయామం కూడా చేసినట్లయితే బరువు నియంత్రణలో ఉంటుంది.