మనకు పూర్వ రోజుల నుంచి రాగి జావ తాగడం అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు రాగి తో పాటు ఓట్స్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఓట్స్ ఇతర దేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. మన పిల్లలు ఇతర దేశాలలో ఉండి అలవాటు చేసుకుంటుంటే వాళ్ళని చూసి మనం కూడా అలవాటు చేసుకున్నాం. రోజూ దోసా, ఇడ్లీ, సాంబార్, చట్నీ వంటివి తీసుకోవడం కంటే రోజు రాగి జావా, ఓట్స్ తీసుకోవడం మంచిది. రాగి జావ ఓట్స్ చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు కాబట్టి ఎక్కువ మంది రాగి జావ, మిల్లెట్ జావ, ఓట్స్ వంటివి తీసుకుని వెళ్లడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
కానీ ప్రతిరోజూ రాగిజావ, ఓట్స్ తీసుకోవడం అంత మంచిది కాదు. పూర్వం అయితే మన పూర్వీకులు ఎక్కువగా ధాన్యాలు పండించే వారు వారికి వేరే ఆప్షన్ లేక అవి మాత్రమే పిండి చేసుకుని లేదా ధాన్యం ఉడికించుకొని తినేవారు. కానీ ప్రస్తుతం మనకి అన్ని దొరుకుతున్నాయి. శరీరానికి కావాలసిన పోషకాలు అందించే ఆహారం తీసుకునే అవకాశం ఉన్నప్పుడు తీసుకోవడం మంచిది. మనం మూడు పూటలా ఉడికించిన ఆహారం తీసుకుంటే నేచురల్ ఆహారం తీసుకోవడానికి కుదరదు.
నేచురల్ ఆహారం ద్వారా వచ్చే యాంటీఆక్సిడెంట్స్, సూక్ష్మ పోషకాలు ఉడికించిన ఆహారంలో ఉండవు. రాగి జావ ఓట్స్ తీసుకోవడం మంచిదే కానీ ప్రతిరోజు తీసుకోకూడదు ప్రతిరోజు ఓట్స్ రాగిజావ ఇడ్లీ దోశ బండి తీసుకుంటే శరీరానికి కావలసిన పొటాషియం, ఫైబర్స్, విటమిన్స్ ఎక్కడ నుండి లభిస్తాయి. అందుకే ప్రతి రోజు వీటిని తీసుకోవడం కంటే మొలకలు తీసుకోవడం మంచిది. నేచురల్ హారం ఒక పూట అయినా సరే తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావలసిన సూక్ష్మ పోషకాలు వీటి నుండి లభిస్తాయి.
రోజులో ఒక పూట అయినా సరే ఉడికించని ఆహారం తీసుకోవడం మంచిది. రాగి జావ వోట్స్ అనేవి కూడా ధాన్యాలు ప్రతి రోజు తీసుకోవడం కంటే ఎప్పుడైనా తినడానికి సమయం లేదు లేక చేసుకునే సమయం లేదు అనుకున్నప్పుడు తీసుకోవచ్చు. రాగి జావ ఓట్స్ తీసుకోవడం వలన ఇడ్లీ సాంబార్ దోస వంటివి తీసుకోవడం వలన వచ్చే కార్బోహైడ్రేట్ కంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. 100 గ్రా ఓట్స్ తీసుకోవడం వలన 386 క్యాలరీలు లభిస్తాయి. 100గ్రాముల రాగిజావ తీసుకోవడం వలన 336 క్యాలరీలు లభిస్తాయి. దీనివలన బద్ధకం లేకుండా తేలికగా అనిపిస్తుంది. వెయిట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది.