చాలా మంది ఎవరైతే బరువు పెరగాలనుకుంటారో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎటువంటి పమఫలితం ఉండదు. దానివలన బరువు పెరగడంపై ఆశలు కోల్పోతారు. కొంతమంది ఎక్కువగా తినలేరు. కొంచెం తిన్న వెంటనే కడుపు నిండిపోతుంది. అలాంటివారికి సరిగ్గా ఆకలి వేయదు. మరికొంతమందికి జీర్ణాశయ సమస్యలు వస్తుంటాయి.
ఇలాంటప్పుడు తిన్నా, తాగినా ఎలాంటి ఫలితం ఉండదు. ఇలాంటి వారు బరువు పెరగడానికి మూడు మార్గాలు ఉన్నాయి. అవి ఏంటంటే హై కాలరీస్, హై కార్బోహైడ్రేట్లు, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడం మరియు తప్పకుండా వర్కవుట్ చేయడం. కొంతమంది అపోహ పడుతుంటారు. ఎక్కువ తినడం జంక్ ఫుడ్ తినడంవలన బరువు పెరుగుతారు అనుకుంటారు. జంక ఫుడ్ బరువు పెంచదు. కేవలం కొవ్వు పెరిగేలా చేస్తుంది.
దీనివలన శరీరం అస్తవ్యస్తంగా పెరుగుతుంది. ఔ జంక్ ఫుడ్లో ఎటువంటి పోషకవిలువలు ఉండవు. అందువలన ఎక్కువగా జంక్ఫుడ్ తినేవారిలో కిడ్నీ, కడుపు జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. దీని వలన అనేక చర్మ, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అధిక బరువు వలన అనేక సమస్యలు తలెత్తుతాయి. అలాగే సన్నగా పీలగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
ముఖ్యంగా లో ఇమ్యునిటి, ఎముకల బలహీనత, విటమిన్ డెఫిసియన్సీ, శరీరం చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకు తట్టుకోలేక పోవడం, శరీరం యొక్క ఎదుగుదల ఆగిపోవడం, రక్తహీనత, కిడ్నీ సమస్యలు, నెలసరి సమస్యలు, శక్తి లేకపోవడం, డ్రై స్కిన్, వెంట్రుకలు రాలిపోవడం, నీరసం , డిప్రెషన్ లాంటి సమస్యలు వస్తాయి. బరువు పెరగడానికి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.
బరువు పెరగడానికి ఆరోగ్యకరమైన అలవాటు గా ఫుల్ ప్యాట్ ఉన్న పాలు పెరుగు తీసుకోవాలి. పెరుగు పైన ఏర్పడే ఫుల్ ఫ్యాట్ పాలు మీద మీగడ తినాలి. ఇది ఆరోగ్యకరంగా మంచికొవ్వు పెరిగేలా చేస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు ఫుల్ ఫ్యాట్ పాలు ఒక గ్లాసుడు తాగండి. దీనివలన శరీరంలో మంచి మార్పు వస్తుంది. దీనివలన ఎముకలు కూడా బలంగా తయారవుతాయి.
అలాగే పీనట్ బటర్ మయొనైజ్ కూడా తీసుకోండి రోజుకోసారి. పీనట్ బటర్ పల్లీలతో, మయొనైజ్ గుడ్లు, లెమన్ జ్యూస్, నూనెలతో తయారు చేస్తారు. రోజుకోసారి పీనట్ బటర్, వారానికి రెండు సార్లు మయొనైజ్ తీసుకోవడం వలన బరువు పెరుగుతారు. దేశీనెయ్యిని చపాతీ లేదా అన్నంలో తీసుకోవాలి. సరైన పద్థతిలో సక్రమంగా నెయ్యి తీసుకుంటే కొద్దికాలానికి బరువు చక్కగా పెరుగుతారు.