గ్లిజరిన్ రసాయనికంగా చక్కెర మరియు ఆల్కహాల్ మిశ్రమం. ఇది చిక్కగా తేలికపాటి తీపి రుచి కలిగిన రంగులేని మరియు వాసన లేని ద్రవం. సౌందర్య ఉత్పత్తులు, సబ్బులు, దగ్గు సిరప్‌లు మరియు బేకరీ వస్తువులతో సహా చాలావాటిలో గ్లిసరిన్ ఉపయోగిస్తారు. గ్లిసరిన్ లో సాధారణ చక్కెర కంటే ఎక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల ఆహారపదార్థంగా ఎక్కువ ఉపయోగించకుండదు. గ్లిసరిన్ యొక్క కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్ అవేంటో చూద్దాం.
చర్మ సంరక్షణ
గ్లిజరిన్ లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది పొడి చర్మం ఉన్నవారికి గొప్ప వరం అని చెప్పవచ్చు. ముఖ్యంగా చలికాలంలో చర్మం తొందరగా పొడిబారి నిర్జీవంగా తయారయ్యే తత్వం కలిగినవాళ్ళు గ్లిజరిన్ చేర్చబడిన సోప్ లు వాడటం వల్ల. చర్మానికి తేమ సమకూరి, మృదువుగా, తిరిగి జీవాన్ని సంతరించుకుంటుంది. అంతేకాదు ముడుతలు పడ్డ చర్మాన్ని తిరిగి సాదారణంగా మార్చడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. గ్లిసరిన్ సబ్బు చాలా సబ్బుల కంటే చర్మంపై సున్నితంగా ఉంటుంది, ఇది పొడి లేదా సున్నితమైన చర్మం ఉన్నవారికి మంచి ఎంపిక.
చికిత్సను వేగవంతం చేస్తుంది.
గాయాలు, గీతలు లేదా మచ్చల మీద వాడటానికి గ్లిజరిన్ ను ఎంపిక చేసుకోవడం వల్ల, చర్మ కణాలు సహజంగా ఆరోగ్యవంతం అవ్వడానికి సహాయపడుతుంది. గ్లిజరిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగం కూడా దీనికి సహాయపడుతుంది, అయితే ఇది చికిత్సా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన స్వచ్ఛమైన గ్లిసరిన్ను ఉపయోగించడం అంత ప్రభావవంతంగా ఉండదు.
ప్రేగు కదలికలను ప్రేరేపిస్తుంది
గ్లిజరిన్ యొక్క మరొక సాధారణ ఉపయోగం మలవిసర్జన సాఫీగా జరిగేలా చేయడం. ఇది చక్కని ఎనిమా గా పనిచేస్తుంది. మరియు ప్రేగులలో అధికంగా ఉన్న శ్లేష్మాన్ని బయటకు పోయేలా చేయడంలో సహాయపడుతుంది. హైపరోస్మోటిక్ ప్రభావం వల్ల ఇది మృదువైన ప్రేగు కదలికను ప్రేరేపిస్తుంది.
చికాకును తగ్గిస్తుంది
తామర, సోరియాసిస్, దద్దుర్లు లేదా పొడి చర్మం వంటి పరిస్థితులపై గ్లిసరాల్ని ఉపయోగించడం వల్ల తేమ కోల్పోకుండా ఆ సమస్యలు తొందరగా తగ్గిపోవడంలో దోహాధం చేస్తుంది. అలాగే వాటి వల్ల ఎదురయ్యే దురద తగ్గించడంలో సహాయపడుతుంది. తేమ ప్రభావాల వల్ల గ్లిసరాల్ చాలా కాస్మెటిక్ సబ్బులు మరియు సమ్మేళనాలలో చేర్చబడుతుంది. తద్వారా చర్మానికి కలిగే అసౌకర్యాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
చర్మం పొడిబారకుండా చేస్తుంది
చర్మం నుండి నీటిని(తేమను) కోల్పోయే భాగాలపై క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మం మరియు శరీరానికి ఎండిపోకుండా ఆరోగ్యకరంగా ఉంచుతుంది. సాధారణం కంటే గ్లిజరిన్ ఉత్పత్తులు వాడటం వల్ల చర్మం 70% ఎక్కువ తేమగా ఉంటుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
గ్లిసరిన్ తేమను కోల్పోకుండా చేయడమే కాకుండా, బయటి వాతావరణానికి వ్యతిరేకంగా చర్మానికి రక్షణను పెంచుతుంది, వీటిలో చికాకులు, కాలుష్య కారకాలు, టాక్సిన్లు మరియు వ్యాధికారక కారకాలు మనకు హాని కలిగిస్తాయి లేదా చికాకును పెంచుతాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
యాంటియేజింగ్
గ్లిసరాల్ యొక్క లోతైన పొర తేమ శక్తి వృద్ధాప్యం తొందరగా దరిచేరకుండా సహాయపడుతుంది. ముడతలు కనిపించడాన్ని తగ్గించడంతో పాటు, ఇది మచ్చలను తగ్గిస్తుంది.
చివరగా…..
గ్లిజరిన్ అనేది చర్మసంరక్షణకు ఎంతగానో దోహాధం చేసినా, దాన్ని నేరుగా ఉపయోగించకుండా ఉండటం చాలా మంచిది.