రోజుకు ఒక యాపిల్ తింటే ఆరోగ్యం మీ చేతుల్లోనే అన్న నానుడి మీరు విన్నారా. అన్ని తెలిసిన పండితులు అసలు ఏమీ తెలియని పామరుల నోటినుంచి అయినా అలవోకగా వచ్చే మాటే అది, అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆపిల్ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ ని కలవాల్సిన అవసరం కూడా రాదు. రోగాల గురించి మనకి వస్తాయి అన్న భయం లేకుండా ఎలాంటి చింత లేకుండా హాయిగా ఉండొచ్చు.
◆యాపిల్ లో విటమిన్ సి ఉంటుంది అందుకే ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది.ఇందులో ఉండే బీ కాంప్లెక్స్ విటమిన్స్ నాడీవ్యవస్థ కి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. యాపిల్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవు. ఒక మీడియం సైజ్ యాపిల్లో 95 శాతం క్యాలరీలు ఉంటాయి.
◆మనం ఆహారం తినడానికి ఒక అరగంట ముందు యాపిల్ తింటే కడుపు నిండినట్టుగా ఉండి 200 కేలరీల తక్కువ ఆహారం తినే అవకాశం ఉంటుంది.
◆ఆపిల్ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తనాళాల్లో ఏర్పడే చెడు కొవ్వును తొలగిస్తుంది. రోజుకో యాపిల్ ఆపిల్ తినడం వల్ల గుండె పోటు రాకుండా నివారిస్తుంది.
◆ఈ రోజుల్లో చిన్న వాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు వేధించే సమస్య మధుమేహం. శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గడం వల్ల మధుమేహానికి గురి అవుతారు.
మన శరీరంలోని ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే బిటా సెల్స్ కు యాపిల్ తినడం వల్ల ఎలాంటి హాని కలగదు.
◆ఎముకలు దృఢంగా ఉండడానికి. పిల్లల్లో పెద్దల్లో జ్ఞాపక శక్తి పెరగడానికి యాపిల్ ఉత్తమ ప్రత్నామ్యయం. ఆపిల్ రోజూ తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన అల్జీమర్స్ వ్యాధికి దూరంగా ఉండొచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం యాపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయి. మరణం నుంచి రక్షిస్తాయి.
◆యాపిల్ కి ఊబకాయం నుంచి రక్షించే గుణం కూడా ఉంది. పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వును తగ్గిస్తుంది. యాపిల్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. మలబద్ధకం లాంటి సమస్యలు ఉన్నవారికి కూడా ఆపిల్ గొప్ప ఉపశమనం.
◆ఇందులో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేసేలా చేస్తుంది. జంక్ ఫుడ్ తినడం వల్ల మన శరీరంలో కొవ్వు బాగా పేరుకు పోతుంది. అలా పేరుకుపోయిన కొవ్వు వల్ల రక్తప్రసరణ సరిగ్గా లేక గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆపిల్ తినడం వల్ల మన శరీరంలో రక్తం లోని కొవ్వు నియంత్రణలో ఉంటుంది.
చివరగా….
అన్ని ప్రయోజనాలు చూసాక రోజుకో ఆపిల్ తిని ఆరోగ్యంగా ఉండాలని అనుకోవడం అత్యాశ ఏమి కాదు కదా.