వీటిని ఎండలో ఎండబెట్టి పొడి చేసి ఇలా వాడితే రక్తమే రక్తం! ఐరన్ పుష్కలంగా ఉంటుంది……

చాలామంది రక్తహీనత లేదా అనీమియా తో బాధపడుతూ ఉంటారు. ఈ  మూడు పోషకాలు అందిస్తే రక్తహీనత తగ్గుతుంది. మొదటిది ఐరన్. ఈ ఐరన్ ప్రతిరోజు మన శరీరానికి 28 మిల్లి గ్రాములు మగవారికి కావాలి. ఆడవారికి 30 మిల్లీగ్రాములు కావాలి. ఐరన్ వంటికి పట్టాలి అంటే విటమిన్ C కావాలి. ఈ విటమిన్ సి అనేది ఒక రోజుకి 50 మిల్లి గ్రాముల నుంచి 100 మిల్లి గ్రాముల కావాలి. ఈ కొత్త రక్త కణాలు బోన్ మారో లో పుట్టాలి అంటే పోలిక్ యాసిడ్ ఎక్కువ కావాలి. అంటే కొత్త కణ నిర్మాణానికి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది అతి ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఒక రోజుకి 400 మైక్రోగ్రాములు కావాలి.

మరి ఈ మూడు పోషకాలు అందించే ఆహారమే రక్తహీనతను తొలగించడానికి ఆధారం. ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం ఏమిటి అంటే కాలీఫ్లవర్ కాడలు. వీటిని ముక్కలుగా కట్ చేసి చట్నీ గాను లేదా కర్రీ గాని చేసుకుని తింటే ఐరన్ రిచ్ గా ఉంటుంది. 100 గ్రాముల కాలీఫ్లవర్ కాడలలో 400 మిల్లీగ్రాముల ఐరన్ కంటెంట్ ఉంటుంది. రెండవది తౌడులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మామిడికాయ పొడి దీనిలో కూడా ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్. రెండవది విటమిన్ C అందుకని కూరలు తినేటప్పుడు నిమ్మరసం పిండుకుని తింటే దానిలో విటమిన్ సీ ఉంటుంది.

నిమ్మరసం పిండుకోవడం వల్ల ఐరన్ ఒంటికి పడుతుంది. ఇక మూడోది పోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండాలి. పెసలు, బొబ్బర్లు, సెనగలు ఈ మూడు గింజల్లో ఎక్కువ ఉంటుంది. వీటిని మొలకలు కట్టుకొని తినాలి. వీటితోపాటు ఫ్రెష్ గా ఉన్న ఫ్రూట్స్ కూడా తినాలి. ఇక ఆకుకూరల్లో, పుదీనాలో పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. రోజుకు ఏదో ఒక ఆకుకూర తినాలి. దానితో పాటు పుదీనా పచ్చడి కూడా పెట్టుకోవాలి. ఇలా చేస్తే రక్తహీనత తగ్గిపోతుంది. రక్తహీనత పోవడానికి ఇలాంటివి చేస్తే చాలా తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మూడు పోషకాలు తీసుకోవడం వల్ల మనకు రక్తహీనత అనేది చాలా బాగా తగ్గుతుంది.

కాబట్టి ఇటువంటి ఆహార నియమాలు పాటిస్తే మనకు ఎటువంటి సమస్య ఉండదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top