ఒక్క రోజు ఈ చిట్కా వాడితే చాలు గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం అజీర్తి తగ్గిపోతాయి. ప్రస్తుతం గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. వేళకాని వేళలో తినడం, పని ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం వలన ఈ సమస్యలు వస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన కూడా ఈ సమస్యలు వస్తాయి. ఈ చిట్కా ఉపయోగించినట్లయితే ఈ సమస్యలన్నీ తగ్గి మీ పొట్ట హాయిగా ఉంటుంది. దీని కోసం మనకు కావలసినవి కరక్కాయలు.
కరక్కాయలు మలబద్దకం, గ్యాస్, అసిడిటీ, అజీర్తి, జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయి. దీనికోసం నాలుగు కరక్కాయలను తీసుకొని కచ్చాబచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలో ఉప్పు తప్ప అన్ని రుచులు ఉంటాయి. కరక్కాయలు మలబద్దకం, ఫైల్స్ వ్యాధిని తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడుతాయి. తర్వాత దీని కోసం కావలసినవి వాము. వాము జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
దీనికోసం కావాల్సిన మూడో పదార్థం జీలకర్ర. జీలకర్ర కూడా జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. దీనికోసం కావాల్సిన మరొక పదార్థం సోంపు. సోంపు గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దీనిలో నల్ల ఉప్పు కూడా అవసరమవుతుంది. మామూలు మనం వాడే ఉప్పు ఉపయోగించకూడదు. నల్ల ఉప్పు మాత్రమే ఉపయోగించాలి. నల్ల ఉప్పు మలబద్ధకం సమస్యను తగ్గించడానికి కడుపులో వాతాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
స్టవ్ మీద పాన్ పెట్టుకొని ముందుగా కచ్చాపచ్చాగా దంచిన కరక్కాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ వాము, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోవాలి. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు నల్ల ఉప్పు, కరక్కాయ తీసుకుంటే సరిపోతుంది. ఈ చిట్కా ఉపయోగించడం వల్ల గ్యాస్, మలబద్ధకం కాకుండా కడుపుకు సంబంధించిన సమస్యలు అన్ని తగ్గుతాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చెంచా సోంపు, ఒక చెంచా నల్ల ఉప్పు వేసుకొని, ముందుగా వేయించి పెట్టుకున్న వాము, జీలకర్ర, కరక్కాయను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఈ పొడిని ఏదైనా గాజుసీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇది ఒక వారం రోజులు పాటు సరిపోతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు వేడి నీటిని తీసుకొని ఒక ముప్పావు చెంచా ఈ పొడిని వేసి బాగా కలుపుకొని నీటిని తాగాలి లేదా ఒక చెంచా పొడిని తిని నీటిని తాగితే సరిపోతుంది. ఇలా ఒక వారం రోజుల పాటు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలు తగ్గుతాయి. లేదా ఈ పొడిని తయారు చేసి పెట్టుకొని ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగించినా సరిపోతుంది. ఈ పొడిని గర్భిణీ స్త్రీలు ఉపయోగించకూడదు. ఈ చిట్కా ఉపయోగించేవారు నీళ్ళు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.