జపనీస్ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ కంటే ఇది పది రెట్లు ఎక్కువ తెల్లగా మార్చే ఇండియన్ సీక్రెట్

ఎండాకాలం వస్తే అందరూ తెల్లగా ఉన్న వాళ్ళు కూడా సన్ టాన్ వల్ల  నల్లగా మారిపోతారు. ఈ సంతోషాన్ని పోగొట్టుకోవడం కోసం పార్లర్కు వెళ్లి రకరకాల క్రీములను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు.  దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. తెల్లగా అవ్వాలి కానీ  ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ వద్దు అనుకున్న వాళ్లు ఒక్కసారి ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం ఒక బౌల్ తీసుకొని నాలుగు చెంచాలు మినప గుళ్ళు వేసుకోవాలి.

మినప గుళ్ళు మునిగేంత వరకు పాలను పోసుకోవాలి. ఇవి నాలుగు గంటల సేపు నాననివ్వాలి. మీకు వీలైతే రాత్రి నానబెట్టి ఉదయం కూడా తయారు చేసుకోవచ్చు.  నానిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని  మెత్తగా మిక్సీ  పట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది  7 రోజుల  నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ముఖం కాళ్లు చేతులు లేదా బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు.

సన్ టాన్,  పిగ్మెంటేషన్, శరీరం  మీద పేరుకుపోయిన జిడ్డు, మురికి పోగొట్టి మీ చర్మాన్ని మీరు కూడా నమ్మలేనంత తెల్లగా మారుస్తుంది. ఈ  పేస్ట్ అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా ఒక వారం నుండి పది రోజులు చేసినట్లయితే   చర్మం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది. మినప గుళ్ళు శరీరంపై నలుపు పిగ్మెంటేషన్ తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. పాలు చర్మాన్ని హైడ్రేట్ చేసి,   మొయిశ్చరైజ్ చేయడంలో సహాయపడుతుంది.

తర్వాత 4-5 చెంచాల మినప గుళ్ళు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒకసారి పిండిని జల్లించుకోవాలి. జల్లించుకున్న పిండిని నాలుగు చెంచాలు తీసుకుని దానిలో పేస్ట్ లా ఉండే విధంగా తేనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి, ఫ్రిడ్జిలో పెడితే వారం 10రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ మిశ్రమాన్ని నల్లగా ఉన్న భాగంలో అప్లై చేసి 20నిముషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.  ఇలా ఈ రెండు చిట్కాలలో ఏదో ఒకటి ట్రై చేయడం వలన తెల్లగా మారిపోతారు. ఈ చిట్కా ట్రై చేసిన 4-5గంటల వరకు సోప్ యూస్ చేయకూడదు. ఈ చిట్కా ట్రై చేసినట్లయితే  చాలా తెల్లగా మెరిసిపోతారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top