ప్రతి 10 మందిలో ఐదుగురికి థైరాయిడ్ సమస్య ఉంటుంది. ఈ సమస్య ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. పని ఒత్తిడి నెలసరి సమయంలో వచ్చే సమస్యలు గర్భధారణ వలన ఇంకా అనేక కారణాల వల్ల థైరాయిడ్ సమస్య వస్తుంది. థైరాయిడ్ గ్రంథి గొంతు లో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉండటం వల్ల బరువు పెరగడం జరుగుతుంది. థైరాయిడ్ 2 రకాలుగా ఉంటుంది. హైపో థైరాయిడ్, హైపర్ థైరాయిడ్. థైరాక్సిన్ హార్మోన్ వలన శరీరంలో జీవక్రియ జరుగుతుంది.
థైరాయిడ్ గ్లాండ్ సరిగా పని చేయకపోతే జీవక్రియ ఆగిపోతుంది. దీనిని థైరాయిడ్ అంటారు. థైరాయిడ్ గ్రంధి హార్మోన్లను తక్కువ రిలీజ్ చేస్తే హైపోథైరాయిడ్, ఎక్కువగా రిలీజ్ చేస్తే హైపర్ థైరాయిడ్ అని అంటారు. థైరాయిడ్ ఉన్నవారిలో తల నొప్పిగా ఉండడం, బరువు పెరగడం, జుట్టు రాలడం, అధికంగా చెమటలు పట్టడం, త్వరగా అలసి పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కేవలం మందులు తీసుకుంటే బరువు తగ్గితే సరిపోతుంది తగ్గిపోతుందిలే అనుకుంటే పొరపాటే. వీటితో పాటు మంచి ఆహారం కూడా తీసుకోవాలి.
సరైన ఆహారం తీసుకున్నప్పుడే థైరాయిడ్ తగ్గుతుంది. థైరాయిడ్ శాశ్వతంగా తగ్గించుకునే చిట్కా ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు నీళ్ళు పోసుకుని దానిలో ఒకటి లేదా రెండు చెంచాల ధనియాలు వేసుకోవాలి. ధనియాలు లేకపోతే కొత్తిమీర లేదా ధనియాల పొడిని కూడా ఉపయోగించుకోవచ్చు. నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని వడగట్టి ఒక చెంచా తేనె కలుపుకుని రోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ధనియాలు థైరాయిడ్ గ్లాండ్ పనితీరును మెరుగుపరిచి థైరాయిడ్ ను తగ్గిస్తాయి.
ధనియాలలో మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ ని కూడా తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతాయి. అలాగే బరువు తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు థైరాయిడ్ కోసం రెండవ చిట్కా. దీని కోసం కావాల్సిన అవిసె గింజలు. అవిసె గింజలు కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. థైరాయిడ్ గ్లాండ్ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.
అవిస గింజలు ఒక సారి పాన్ లో వేసుకొని వేడి చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. రోజు ఉదయాన్నే ఒక చెంచా పొడిని గ్లాసు నీటిలో కలుపుకుని తాగడం లేదా ఒక చెంచా పొడిని తిని నీటిని తాగితే సరిపోతుంది. ఇది ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇది ఉదయం తీసుకుంటే ధనియాల రసం రాత్రి తీసుకోవాలి లేదా రెండిటిలో ఏదో ఒకటి ట్రై చేయవచ్చు. అవిస గింజలు థైరాక్సిన్ అనే హార్మోను మోతాదు మించి రిలీజ్ అవ్వకుండా సహాయపడతాయి.