కాళ్ళు, చేతులు, మెడ భాగంలో ఉండే నలుపు జిడ్డు, మురికి , సన్ టాన్ మొత్తం 5 నిమిషాల్లో మాయం

మనం బయటకు వెళ్ళినప్పుడు ఎండ వల్ల దుమ్ము ధూళి వలన కాళ్లు చేతులు మెడ వంటి భాగాల్లో  నల్లగా అయి పోతాయి. సరైన క్లీనింగ్ లేకపోవడం వలన కూడా సన్ టాన్, జిడ్డు, మురికి వంటివి పట్టేసి చర్మం నల్లగా అయిపోతుంది.   చాలా రోజులు నుండి పేరుకుపోయిన జిడ్డు, మురికి, సన్ టాన్ పోగొట్టుకోవడానికి  900 వరకు ఖర్చవుతుంది. అంత ఖర్చు పెట్టిన అవసరం లేకుండా కేవలం ఐదు రూపాయలు తోనే ఈజీగా ఇంట్లోనే కాళ్లు, చేతులు, మెడ వంటి భాగాలు కూడా  తెల్లగా చేసుకోవచ్చు.

దీని  కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా కాఫీ పౌడర్ ను వేసుకోవాలి. దీనిలో  అరచెంచా బేకింగ్ సోడా వేసుకోవాలి. కాఫీ  పౌడర్ సన్ టాన్ , జిడ్డు, మురికి పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఒక చెంచా నిమ్మరసం కూడా వేసుకోవాలి.  బేకింగ్ సోడా, నిమ్మరసం బ్లీచింగ్ ఏజెంట్స్ గా పనిచేస్తాయి. సన్ టాన్  జిడ్డు పోగొట్టడం లో అద్భుతంగా ఉపయోగపడతాయి. మనం పార్లర్కి వెళ్లి పెడిక్యూర్ లేదా మేనిక్యూర్ చేయించుకోవాలి అంటే ముందుగా నలుపు పోవడానికి బ్లీచ్  ఉపయోగిస్తారు.

బేకింగ్ సోడా, నిమ్మరసం నేచురల్ బ్లీచింగ్ గా ఉపయోగపడతాయి. తర్వాత దీనిలో ఒక షాంపూ ప్యాకెట్  వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలుపుకున్న తరువాత కాళ్లు చేతులు మెడ వంటి భాగాలలో ఈ మిశ్రమాన్ని రసం తీయగా మిగిలిన నిమ్మచెక్కతో రుద్దుకోవాలి.   రుద్దిన తర్వాత ఐదు నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వలన మీ చర్మంపై పేరుకుపోయిన జిడ్డు మురికి సన్ టాన్  వంటివి తగ్గుతాయి. ఈ ప్యాక్ను ముఖంపై అప్లై చేసుకోవాలి అనుకున్నవారు ముందుగా ప్యాచ్  టెస్ట్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకపోతే అప్లై చేసుకోండి.

పార్లర్కు వెళ్లి గంటలకొద్ది కూర్చొని ఎక్కువ ఖర్చు పెట్టనవసరం లేకుండా ఈజీగా  ఇంట్లో ఉండే వాటితోనే మీ చర్మంపై పేరుకుపోయిన జిడ్డు, మురికి, సన్ టాన్  వంటి వాటిని తగ్గించుకోవచ్చు. మెడ కాళ్లు చేతులు గిలకలు వంటి భాగాల్లో ఎప్పటినుంచో  పేరుకుపోయిన మురికి కూడా ఒకసారి అప్లై చేసేసరికి పోతుంది. ఈ చిట్కా ఒకసారి ట్రై చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top