సమ్మర్ లో వచ్చిన నలుపు పది నిమిషాల్లో మాయం చేసే వంటింటి చిట్కా……. ఎంత నల్లగా ఉన్న తెల్లగా మెరవాల్సిందే…….

సమ్మర్ లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన స్కిన్ టాన్ అవుతూనే ఉంటుంది. ఈ టాన్ ను తొలగించుకోవడానికి మనం పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉపయోగించే పదార్థాలతోనే 10 నిమిషాలలో రెండు రోజులపాటు ఉపయోగిస్తే టాన్ మొత్తం క్లియర్ చేసుకోవచ్చు. ఈ చిట్కాను మొత్తం శరీరం భాగాల్లో ఎక్కడైనా ఉపయోగించవచ్చు. అంతే కాకుండా దీనిని ఉపయోగించడం వలన మన ఫేస్ బ్రైట్ గా ఉంటుంది. దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. ఇప్పుడు రెమిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

దీనికోసం గిన్నె తీసుకొని అందులో ముందుగా రెండు స్పూన్ల పెరుగును వేసుకుందాం. పెరుగు మన స్కిన్ టైటినింగ్ అవ్వడానికి సహాయపడుతుంది. మరియు మంచి బ్రైట్నెస్ తీసుకు రావడానికి సహాయపడుతుంది. తర్వాత మనకు కావాల్సింది ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పౌడర్. ఉసిరి పౌడర్ స్థానంలో టమాటా రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. తర్వాత మనకు కావాల్సింది ముల్తానీ మట్టి. ఇది ఒక స్పూన్ తీసుకోవాలి. తర్వాత మనకి కావాల్సింది ఆరెంజ్ పీల్ పౌడర్. ఇది ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి
ఈ పౌడర్స్ ఉపయోగించడం వలన మన స్కీన్ క్లీన్ అండ్ బ్రైట్ గా ఉంటుంది. తర్వాత మనకు కావలసింది కస్తూరి పసుపు. పసుపు ఉపయోగించడం వలన మన స్కిన్ గ్లో గా మరియు స్పాట్ లేస్ గా ఉంటుంది. మరియు పసుపు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండడంవల్ల చర్మం పై ఉండే బ్యాక్టీరియా వైరస్లు తొలగించబడతాయి. దీనివలన మొఖం పింపుల్స్ రహితంగా ఉంటుంది. ఇది ఒక స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని కొంచెం వాటర్ వేసి ప్యాక్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం ఒక పెస్ట్ లాగా తయారవుతుంది.
ఈ ప్యాక్ మన ఫేస్ పై మరియు శరీరం పైన ఉన్న బ్లాక్ నెస్ మొత్తం తొలగిస్తుంది. ఈ మిశ్రమాన్ని మన ఫేస్ పై మరియు శరీరం పై ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. ఇలా పది నిమిషాల పాటు ఉంచిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా పది నిమిషాల పాటు రెండు రోజులు చేయడం ద్వారా చాలా మంచి ఫలితాం లభిస్తుంది….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top