చాలామంది అన్నం వండిన తర్వాత గంజిని బయట పారేస్తూ ఉంటారు. కానీ గంజి లో చాలా పోషకాలు ఉన్నాయి. జుట్టు ఎక్కువ రాలడం వంటి సమస్యలు ఉన్నవారికి గంజి ఒక మంచి మెడిసిన్ లా ఉపయోగపడుతుంది. ఈ గంజి విటమిన్ B, E పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జుట్టు బలంగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్ళని బలపరచడానికి, జుట్టు ఊడకుండా ఒత్తుగా వచ్చేలా చేయడానికి అన్నం వండిన తర్వాత వచ్చే గంజి నీరు చక్కగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. 2010 సంవత్సరంలో బ్యూటీ కేర్ యూనివర్సిటీ ఒకోహోమా జపాన్ వారు పరిశోధన చేశారు.
ఈ పరిశోధనలో గంజి నీరు చాలా బాగా ఉపయోగపడుతున్నాయని తెలియజేయడం జరిగింది. గంజిలో ముఖ్యంగా ఎక్కువ మోతాదులో ఉండే ఇనోసిటల్ కెమికల్ కాంపౌండ్ వల్ల జుట్టు కుదుళ్లకు ఈ రకమైన బెనిఫిట్ వస్తుంది అని నిరూపించారు. జుట్టు ఊడకుండా దృఢంగా ఉండడానికి జుట్టు షైనీగా నిగనిగలాడుతూ ఉండడానికి ఈ గంజి అనేది బాగా ఉపయోగపడుతుంది. చాలామందికి జుట్టు చిక్కులు చిక్కులు పడుతూ అదో రకంగా ఉంటుంది. అలాకాకుండా షైనీగా, స్మూత్ గా, సిల్కీ గా ఉండడానికి ఈ గంజి ట్రీట్మెంట్ బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మరి ఈ గంజిని తీసుకుని మాడు భాగంలో బాగా అప్లై చెయ్యాలి.
ఇలా ఒక పది పదిహేను నిమిషాలు మర్దన చేయటం వల్ల ఇన్నోసెంట్ అనే కెమికల్ కాంపౌండ్ జుట్టు కుదుళ్ల వరకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. జుట్టు మొత్తానికి పైనుంచి కింద వరకు ఈ గంజి నీళ్ళ ను అప్లై చేసి ఒక గంట సేపు వరకు అలా ఇంకనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఈ గంజి మీ జుట్టుకు ఒక మంచి కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ జుట్టును మెరిసేలా చేస్తాయి. పట్టు లాంటి మృదువైన జుట్టు కోసం ఈ గంజి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఈ గంజి ని ప్రతిరోజు తాగడం ద్వారా ఆరోగ్యపరంగ చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఫేస్ కి అప్లై చేయడం ద్వారా ఫేస్ లో గ్లో పెరుగుతుంది.
అందువల్ల ఈ గంజిని వారానికి రెండు సార్లు అప్లై చేయడం ద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.