మీకు గ్యాస్టిక్ మరియు అజీర్ణ సమస్యలు ఉన్నాయా అయితే దీనిని పచ్చిగా ఉన్నప్పుడే రసం తీసుకుని తాగండి…

అల్లంని నిత్యం మన వంటల్లో వేస్తూ ఉంటాం. గ్యాస్ట్రిక్ మరియు అజీర్ణ సమస్యలు అజీర్ణం తగ్గించడానికి, ఆకలి పుట్టించడానికి అల్లం పెట్టింది పేరు. పూర్వం రోజుల నుండి ఎవరికి పొట్టలో బాగోకపోయినా, అరుగుదల లేకపోయినా, ఆకలి అవ్వకపోయినా అల్లాన్ని రోట్ లో వేసి నూరి దాని గుడ్డలు ఏసి పిండి అల్లం రసాన్ని తీసేవారు. ఈ పచ్చి అల్లం రసం ని ఒక స్పూన్ తీసుకొని రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు తేనె కలుపుకొని నాలిక పైన నాకిస్తారు. దీనిని ఎక్కువగా పరగడుపున తీసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఈ అల్లం రసము తేనె కాంబినేషన్లో తీసుకుంటే అల్లంల్లో ప్రధానంగా జింగిరాలని కెమికల్ ఉంటుంది.

ఈ జింజిరాలనే కెమికల్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ని డైజెస్టివ్ జ్యూసెస్ ని బాగా రిలీజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కెమికల్ అనేది ఆకలిని బాగా పెంచుతుంది. లేదు అనుకుంటే అల్లం రసాన్ని కొద్దిగా వేడి చేసి దానిలోకి తేనె కలుపుకొని తాగితే రుచిగా కూడా ఉంటుంది. ఇలా చేస్తే పచ్చివాసన పోయి ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇలాంటి అల్లం రసం తేనె కలిపిన జ్యూస్ ని ప్రతిరోజు ఒక స్పూన్ తీసుకుంటే జీర్ణకోశ సంబంధ సమస్యలను నిర్మూలించడానికి అద్భుతంగా ఉపయోగపడే ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం అల్లం రసం.  కాబట్టి దీనిని ఉపయోగించవచ్చు. ఈ అల్లం అనేది మంచి ఆక్సిడెంట్ గా పని చేస్తుంది.

రక్తం రక్తనాళాల్లో గడ్డకట్టనీయకుండా కాపాడుతుంది. ఈ అల్లం రసం మలబద్దకాన్ని దూరం చేసి ఫ్రీ మోషన్ అయ్యేలా చేస్తుంది. ఈ అల్లం రసం రోజు తీసుకోవడం వల్ల జలుబు దగ్గు జ్వరం లాంటి లక్షణాలు త్వరగా తగ్గిపోతాయి. దీనినిత్యం వాడడం వల్ల శరీరం లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ సమస్యల ను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఈ అల్లం రసం బాగా ఉపయోగపడుతుంది. నిత్యం అన్నం రసం తాగడం వల్ల కడుపులో పూత, అజీర్తి, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ మలబద్ధకం ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల అధిక బరువు ఉన్నవాళ్లు తగ్గుతారు.

డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ అల్లం రసం తాగితే బ్లడ్ లో షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా మంచి ఫలితం లభిస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top