జిడ్డు చర్మం ఇబ్బందిని కలిగిస్తుందా? ముఖాన్ని ఎంత కడుకున్నా తాజాదనపు అనుభూతి కలగడం లేదా? మగా, ఆడా అని తేడా లేకుండా అందరూ ఈ జిడ్డు చర్మ బాధితులే. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయమేంటంటే, జిడ్డు చర్మం చాలా రకాల సమస్యలను తెస్తుంది. మొటిమలు, మచ్చలు వచ్చేలా చేస్తుంది. ఈ సమస్యను అధిగమించటం కష్టమే కానీ సరైన జీవన శైలీ, ఆహార విధానాలను పాటిస్తూ.. తగిన జాగ్రత్తలను తీసుకుంటే ఈ సమస్యలను తేలికగా ఎదురుకోవచ్చు.
జిడ్డు చర్మాన్ని నివారించటానికి కొన్ని ఉపాయాలు..
- జిడ్డు చర్మం ఉన్నవారు.. రోజుకి రెండు సార్లు మంచి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
- ఆయిల్ స్కిన్ ఉన్నవారు, పేస్ వాష్ వాడాలి, హార్డ్ సోప్స్ వాడరాదు.
- మీ చర్మం లోని గ్రంధుల్ని వేడి నీరు ప్రభావితం అయ్యేల చేస్తూ జిడ్డు రాకుండా చేస్తుంది.
- వేడి నీటితో కడగటం వల్ల గ్రంధులు విచ్చుకునే ఉంటాయి. ఇక రోజ్ వాటర్ రాయటం వల్ల అది స్కిన్ టోనర్ గా పనిచేయటమే కాక గ్రంధుల్ని మూసుకుపోయేలా చేసి, చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.
- సహజసిధ్ధమైన తేయాకు నూనె రాస్తే చర్మం పై వచ్చిన మచ్చలను, మొటిమలను పోగొడుతుంది.
- స్క్రబ్ చేయటం చాల మంచిది. దీని వల్ల ముఖంపై ఉన్న జిడ్డు పోయి ఎప్పుడూ తాజాగా కనిపిస్తారు. ఓట్మీల్, ఆల్మండ్, సముద్రపు ఉప్పు, లాంటివి వాడాలి.
- ముఖం పై జుట్టు పడకుండా చూసుకోవాలి, ఆయిల్ శాతం ఎక్కువగా ఉండే షాంపూలు, మానేయాలి. అలానే పిల్లో కవర్లని తరుచూ మారుస్తుండాలి.