ఇప్పుడు ప్రతి ఒక్కరూ జుట్టు ఆర పెట్టుకోడానికి హెయిర్ డ్రయ్యర్ కొనుక్కుంటున్నారు. స్నానం చేసిన వెంటనే ఈజీగా నిమిషాల్లో జుట్టును ఆర బెట్టేస్తుంది. కొంతమంది జలుబు, దగ్గు వస్తుందేమో అన్న భయం తో ఇలా చేస్తారు. మరికొంతమంది జుట్టు స్ట్రైట్నింగ్,షేప్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. పని సులువు అవుతుంది కదా అని ఇలాంటివి ఉపయోగించడం వల్ల చాలా నష్టాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జుట్టు ని షేర్ చేసుకోవడానికి ట్రై చేసుకోవడానికి హీట్ చేయడం వలన జుట్టు యొక్క ఒరిజినాలిటీ పోతుంది.
ఆ వేడి కాయ చెట్టు తగలడం వలన ఏమి నష్టాలు వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వేడి గాలి తగలడం వల్ల మూడు ప్రధానమైన నష్టాలు కలుగుతాయి. వాటిలో మొదటిది వేడి గాలి తలకు తాకడం వలన తల భాగంలోని చర్మం డ్రై అయిపోయి జుట్టు మొత్తం పొడిబారిపోతుంది. జుట్టు డీ హైడ్రేట్ అవుతుంది. జుట్టులో నీటి శాతం తగ్గే సరికి కుదుళ్ళు బలహీనపడతాయి. వేడిగాలి చర్మానికి తగిలినప్పుడు అక్కడ రక్తనాళాలు వ్యాకోచించి అక్కడ రక్తం వెనక్కి వెళ్లి పోతుంది. మనం తలస్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
స్నానం చేసిన వెంటనే వేడి గాలి తగలడం వల్ల రక్తం వెనక్కి వెళ్ళిపోయి జుట్టు రాలడం మొదలవుతుంది. రెండవ నష్టం ఈ చెట్టు డిహైడ్రేట్ అవ్వడం వల్ల జుట్టు కుదుళ్ల దగ్గర చిట్లడం, చివర్లు చిట్లడం, మధ్యలోకి విరిగి పోవడం వంటివి జరుగుతాయి. వేడి గాలి జుట్టుకు తగలడం వలన జుట్టు ఆరిపోయి తడి లేకపోవడం వలన జుట్టు చిట్లడం వంటి సమస్యలు ఏర్పడతాయి. హెయిర్ డ్రైయర్ వాడడం వలన మూడవ నష్టం చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. తల భాగంలో చర్మం కింద ఉండే మెలనోసైట్స్ మెలనిన్ అనే వర్ణ ద్రవ్యాన్ని విడుదల చేయకపోవడం వలన వెంట్రుకలు తెల్లబడతాయి.
హెయిర్ డ్రయ్యర్ నుండి వచ్చేవేడిగాలి చర్మానికి తగలడం వలన మెలనోసైట్స్ మెలనిన్ అనే వర్ణద్రవ్యం ని విడుదల చేయవు. దీని వల్ల అతి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. అందుకే జుట్టును హెయిర్ డ్రయ్యర్ పెట్టుకోవడం కంటే ఫ్యాన్ గాలికి ఆరబెట్టడం మంచిది. ఎప్పుడైనా ఏదైనా ప్రత్యేక సందర్భాలలో అత్యవసరం అయినప్పుడు వారానికి ఒకటి రెండు సార్లు హెయిర్ డ్రయర్ హెయిర్ స్ట్రైట్నింగ్ వంటివి చేసిన పర్లేదు ప్రతిరోజు ఉపయోగించడం వలన ఈ నష్టాలు వస్తాయి. అందుకే అందరూ వీలైనంతవరకు జట్టును సాధారణంగా ఫ్యాన్ గాలికి లేదా ఎండవేడికి ఆడ బెట్టుకుంటే మంచిది. హెయిర్ డ్రయ్యర్ వంటివి ఉపయోగించడం వలన జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది.