చాలామందిని ఎక్కువగా బాధిస్తున్న సమస్య ఒళ్ళునొప్పులు, కీళ్ళనొప్పులు. చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అసలు నొప్పి రావడానికి ముఖ్యకారణం ఆ అవయవాలలో ఆక్సిజన్ తగ్గడం. ఈ సమస్య కు ఆయుర్వేదంలో ముక్కు లో దేశీ ఆవునెయ్యిని వెయ్యడాన్ని చికిత్సగా చేస్తారు. ఇంకో చికిత్సగా జిల్లేడు ఆకులను ఉపయోగిస్తారు. ఇవి రోడ్డు పక్కన కనిపిస్తుంది. వినాయకుని పూజలో విశేషంగా ఉపయోగిస్తుంటాం. ఇందులో రెండు రకాల మొక్కలు ఉన్నాయి. ఒకటి వంగపూవురంగు పూలు పూసే మొక్క, రెండోది తెల్లపూవులు పూసే మొక్క.
ఈ మొక్క ఆకులను చికిత్స లో ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. ఆకులను తెంపేటపుడు ఈ పాలు కంట్లో పడకూడదు. ఉపయోగించిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పూవులను పదివరకూ తీసుకుని ఒకగ్లాసు నీటిలో వేసి మరగించాలి. అప్పుడు ఈ పూలలో ఉండే ఔషధగుణాలు ఆ నీటిలో చేరతాయి. తర్వాత పూవులను వేరుచేసి ఆ గోరువెచ్చని నీటిలో పాదాలను పది నిమిషాలు ఉంచాలి. తర్వాత ఉడికించిన పూలను గుడ్డతో నొప్పులు ఉన్నచోట కట్టడం వలన నొప్పులు తగ్గుతాయి.
ఒక జిల్లేడు ఆకుని తీసుకుని ఆముదం లేదా నువ్వుల నూనె రాసి వేడిచేయాలి.ఆ తర్వాత ఆకును పాదాలు, కీళ్ళనొప్పులు ఉన్నచోట రాయాలి. మూడో చిట్కా ఏమిటంటే జిల్లేడు చెట్టునుండి పాలను సేకరించి నొప్పి ఉన్నచోట ఈ పాలతో రెండు నుండి మూడునిమిషాలు మసాజ్ చేయాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఈ పాలతో మోకాళ్ళ కు మసాజ్ చేసిన తర్వాత ఆకుకి నూనెరాసి వేసిచేసి మోకాలికి కట్టడం వలన పదినుండి పదిహేను రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయి.
నడుము నొప్పికి కూడా ఈ చిట్కాలు పనిచేస్తాయి.
జిల్లేడు ఆకులు, పూవులు, పాలతో కాళ్ళు, మోకాళ్ళు, మడమలనొప్పులకు చక్కగా పనిచేస్తాయి. ఈ చిట్టాలతో ప్రయోజనం లేకపోతే మీ శరీరంలో కాల్షియం డెఫీషియన్సీ, ఎముకలు విరగడం లేదా రక్తహీనత సమస్య అయిఉండొచ్చు. వారికి పూర్తి ఫలితం ఉండకపోవచ్చు. డాక్టర్ సలహాతో వైద్యం మరియు ఆహారపుటలవాట్లు మార్చుకోవాలి.అలాగే గర్భవతులు, బాలింతలకు ఈ చిట్కాలు ఉపయోగించకపోవడం మంచిది.