మృదువైన సిరోజాలు కావాలంటే ….ఇలా చేయండి!

మృదువైన సిరోజాల కోసం ప్రతి వనిత ఆశపడుతుంది. అయితే ప్రస్తుత కాలుష్య వాతావరణాన్ని దృష్టిలో ఉంచితే, ప్రతి రోజు మీకున్న కొద్దిపాటి సమయంలో మీ జుట్టని సంరక్షించుకొనే ప్రయత్నం చేయాలి.

  • వారానికి రెండు సార్లు రాస్తే చాలు. జుట్టు రాలడం తగ్గి మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా బలంగా పెరుగుతుంది
  • కేవలం అయిదు నిమిషాల్లో మీ ముఖం పై ఉన్న నల్లదనం మొత్తం పోయి తెల్లగా మెరిసిపోతారు.
  • జుట్టు అంచు చివర్లు విరగడం,చిట్లడం వంటివి మనం గమనిస్తుంటాము.దీనికోసం,మగ్గిన అరటిపండ్లు ఎంతో ఉపయోగపడతాయి. రెండు మగ్గిన అరటిపండ్లను తీసుకొని, గుజ్జులా చేసుకోవాలి,అందులో రెండు గుడ్లసొన,ఒక నిమ్మకాయ రసం,విటమిన్ ‘ఈ’ ఆయిల్ కూడా అందులో కలిపి  జుట్టికి బాగా పట్టించాలి. ఈ ప్యాక్ క్రింద పడకుండా, షవర్ క్యాప్ ధరించాలి. గంట తర్వాత,  క్యాప్ తీసి, కాసేపు జుట్టుని నెమ్మదిగా మర్దన చేయాలి.. ఆ తరువాత గోరువెచ్చని నీటితో షాంపూ చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చేస్తే, జుట్టు నిగనిగలాడటంతో పాటు, చివర్లు చిట్లడం ఆగుతుంది.
  • రెండు టేబుల్ స్పూన్ల చప్పున, మెంతులు ,పెసలు ముందురోజే నానబెట్టేసుకోవాలి. మర్నాడు ఈ రెండిటిని మెత్తగా పేస్టు చేసుకోవాలి. ఈ పేస్టు లో ఒక గుడ్డుసొన, రెండు చంచాల శీకాకాయపొడిని కలిపి, తలకు షాంపూలాగా రాసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయండి.. మృదువైన కురులు మీ సొంతం. ఈ ప్రక్రియ క్రమంగా చేస్తే.. జుట్టు నల్లగా,వత్తుగా మారుతుంది.. జుట్టి ఎదుగుతుంది.. చుండ్రు, దురదలకి దూరంగా ఉంటారు.
  • ఇంకొక చిట్కా చెప్పుకుందాము.. ఒక కప్పు పెరుగులో, కొద్దిగా నిమ్మరసం పిండుకొని,దాంట్లోనే ఒక గుడ్డుసొన కలపాలి. దీన్ని పూతల రాసుకొని,ఆరాక కడిగేసుకోవాలి. పెరుగు,చుండ్రిని అరికడుతుంది. గుడ్డు మాయిశ్చరైజర్ లా పనిచేస్తూ తేమనిస్తుంది.. మీ కురులు.. మృదువుగా, అందంగా మారతాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top