ఒక్కసారి రాస్తే చాలు. గజ్జి, తామర, దురద ఒక నిమిషంలో మాయం

శరీరంలో బాహు మూలలు, గజ్జల్లో సరిగ్గా గాలి తగలక గజ్జి, తామర వంటి అనేక రకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. వాటికి చికిత్స తీసుకోకపోతే శరీరమంతా వ్యాపిస్తాయి. లేదా ఇతరులకు కూడా మన ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీటికి వెంటనే చికిత్స ప్రారంభించాలి. కానీ ఆయింట్మెంట్లు, మందులు అందుబాటులో లేనప్పుడు, లేదా సహజంగా తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిట్కాలు పాటించండి. అతి తక్కువ సమయంలో చర్మవ్యాధులు తగ్గించి మీకు దురద, వ్యాధి వలన వచ్చే నల్లటి మచ్చలు మరియు ఇబ్బంది నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మొదట మనకు కావలసిన పదార్థాలు వేపాకులు.

వేపాకులు వివిధ రకాల చర్మ వ్యాధులు, సెప్టిక్ పుండ్లు మరియు  కాలిన గాయాలకు వ్యతిరేకంగా వేప ఔషణ గుణాలు ప్రభావవంతంగా ఉంటాయి.  ఆకులు, పేస్ట్ లేదా డికాక్షన్స్ రూపంలో అప్లై చేయబడి, దిమ్మలు, అల్సర్ మరియు తామర కోసం కూడా సిఫార్సు చేయబడతాయి.  స్క్రోఫులా, ఇండోలెంట్ అల్సర్ మరియు రింగ్వార్మ్ వంటి చర్మ వ్యాధులకు ఈ వేప నూనెను ఉపయోగిస్తారు.

ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో మరిగించాలి. ఇవి బాగా మరిగి నీళ్ళలో వేపాకుల సారం దిగాక స్టవ్ ఆపు చేసుకుని నీటిని గోరువెచ్చగా చేసుకోవాలి.

తర్వాత చిట్కా కోసం ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకుని అందులో ఒకటి లేదా రెండు కర్పూరం బిళ్ళలను నలిపి పొడి వేయాలి. ఈ రెండింటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎక్కడైతే చర్మసమస్యలు ఉన్నాయో అక్కడ వేపాకుల నీటితో కడిగి శుభ్రంగా తుడుచుకున్న తర్వాత కొబ్బరినూనె, కర్పూరం మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఇలా తరుచు చేయడం వలన కొన్ని రోజుల్లోనే, గజ్జి, తామర, దురద వంటి చర్మసమస్యలు తగ్గిపోతాయి.

కర్పూరం 3% నుండి 11% సాంద్రతలలో నొప్పులకు పెయిన్ కిల్లర్‌గా చర్మంపై ఉపయోగించడానికి FDA- ఆమోదించబడింది.  జలుబు, పుండ్లు, కీటకాలు కుట్టడం మరియు కాటు, చిన్న కాలిన గాయాలు, అనేక రకాల చర్మసమస్యలు మరియు హేమోరాయిడ్‌లకు సంబంధించిన నొప్పిని తగ్గించడానికి ఇది అనేక రబ్-ఆన్ ఉత్పత్తులలో ఉపయోగించబడుతుంది.  దురద తగ్గించడంలో ప్రభావవంతమైనది. కొబ్బరినూనె కూడా చర్మసమస్యలు తగ్గించడంలో చాలా బాగా తోడ్పడుతుంది.ఈ రెండు చిట్కాలు క్రమం తప్పకుండా పాటిస్తూ చర్మసమస్యలు నుండి ఉపశమనం పొందండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top