శరీరంలో విటమిన్ డి లోపిస్తే ఎదురయ్యే సమస్యలు..!

రక్షణ వ్యవస్థకి అతి ముఖ్యమైన అవసరం విటమిన్ D. శరీరంలో అన్ని రకాల రక్షక దళాలని యాక్టివేట్ చేసి వైరస్, బ్యాక్టీరియాల మీద దాడి చేయడానికి సపోర్ట్ చేసేది విటమిన్ D. పిల్లలలో ఎదుగుదలకు విటమిన్ డి అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ డి అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. మన శరీరానికి విటమిన్ డి అనేది రోజుకి 15 మైక్రో గ్రాములు కావాలి. గర్భిణీలకు, బాలింతలకి 20 మైక్రో గ్రాములు కావాలి. విటమిన్ డి లోపించినప్పుడు కాళ్లు వంకరగా అవుతాయి. అలాగే ఎముకలకు బాగా నొప్పులు వస్తాయి. అలాగే ఎముకలకు బలం లేక విరిగిపోతూ ఉంటాయి.

విటమిన్ D లోపం వల్ల ఎక్కువగా రోగాలు బారిన పడడానికి అవకాశం ఉంటుంది. ఎండ తగిలితేనే శరీరానికి విటమిన్ D అందుతుంది. సహజంగా విటమిన్ D అనేది శాకాహారంలో D2 రూపంలో ఉంటుంది. ఈ D2 పేగులు తక్కువ గ్రహించుకుంటాయి. ఎందువలనంటే మనం తినే ఎసిడిక్ ఫుడ్స్ వల్ల, వాడే మందులు కెమికల్స్ వల్ల, ప్రేగులో హెల్ప్ ఫుల్ బ్యాక్టీరియాలు లేనందువల్ల ఆహారాల్లో ఉన్న తక్కువ గ్రహించుకుంటాయి. నాటు ఆవు జున్ను పాలల్లో 320 మైక్రోగ్రాముల విటమిన్ D3 లభిస్తుంది. ఈ జున్నును వారానికి లేదా పది రోజులకు ఒకసారి తినగలిగితే విటమిన్ D లోపం మందులు వాడకుండానే తగ్గించుకోవచ్చు.

ఉదయం 9:30 -10 మధ్యలో నుండి మధ్యాహ్నం 1:30- 2  మధ్య ఎండలో గనక శరీరం ఒక గంట సేపు లేదా ముప్పావు గంట సేపు గడిపితే అల్ట్రా వైలెట్ బి కిరణాలు ఈ ఎండలో మాత్రమే ఉంటాయి. ఈ కిరణాల్లో మాత్రమే డి విటమిన్ తయారవుతుంది. ఈ కిరణాలు చర్మం మీద పడినప్పుడు చర్మం లోపల కొలెస్ట్రాల్ సహాయంతో అల్ట్రా వైలెట్ బి కిరణాలు విటమిన్ D3 గా తయారుచేస్తాయి. ఈ విటమిన్ D3 లివర్ లోకి వెళ్తుంది. లివర్ దీనిని విటమిన్ D గా మార్చి రక్తం లోకి వదులుతుంది. రక్తంలోకి వచ్చిన విటమిన్ D కిడ్నీలు యాక్టివేట్ చేస్తాయి. అప్పుడు ఇది శరీరానికి ఉపయోగపడుతుంది. విటమిన్ డి లోపిస్తే నీరసం వస్తుంది. జుట్టు అధికంగా రాలిపోతుంది.

జుట్టుకి ఎండ తగలకపోతే నలుపు కాస్త తెలుపుగా మారిపోతుంది. దీనికి పరష్కారం విటమిన్ D టాబ్లెట్స్ వారానికి ఒకటి చప్పున నెల రోజులు పాటు వేసుకుంటే సరిపోతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top