మూరెడు కాయ, ముత్యమంత ఆకు. అందరికీ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయ్. మూరెడు కాయ అనగానే ఏదో ఒకలా కచ్చితంగా మునక్కాయ అని చెప్పేస్తారు, చల్క్ మందికి కూడా మునక్కాయ అంటే మహా ఇష్టం. అయితే మునగాకు మహత్యం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ఆకుతో 300 వ్యాధులని దూరం చేసే సామర్థ్యం ఉంది అంటే మీరు నమ్ముతారా. నమ్మాలి తప్పదు.
ఇంకా మునగాకులో దాగిన తెలుసుకుందాం. అద్భుతాలు ఒక్కసారి చూస్తే దిమ్మ తిరుగుతుంది. కావాలంటే మీరే చూడండి.
◆మునగాకులో ఎ, సి విటమిన్లు వున్నాయి. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు. ఇంకా చెప్పాలంటే పాస్పరస్ కు మునగాకు మూలం. ఇందులో రక్తవృద్ధికి ఉపయోగపడే ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.
◆ ఆయుర్వేద మందుల తయారీలో 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. మునగాకుల్లో విటమిన్స్, అమైనో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే వచ్చే విటమిన్ ఎ ని పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా మనం పొందొచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన ఔషధాల తయారీలో మునగాకును వాడతారు.
◆పాల నుంచి లభించే క్యాల్షియంకు 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. సాధారణంగా పెరుగులో మనకు ప్రోటీన్లు అధికంగా అందుతాయి, కానీ మునగాకును తీకుంటే పెరుగుకంటే ఎక్కువ ప్రోటీన్లు శరీరానికి అందించిన వాళ్ళం అవుతాము.
◆మహిళలు రోజుకి మూడు చిటికెల మునగాకు పొడిని వేడినీళ్లతో ఉదయం పూట 3 నెలల పాటు రెగ్యులర్గా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళతో రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ గా మునగాకు ఉపయోగపడుతుంది.
◆రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు క్రమబద్దీకరించడానికి ఇందులో ఉండే క్లోరోజేనిక్ యాసిడ్ దోహదం చేస్తుంది. అలాగే మునగాకుల రసాన్ని పాలలో కలపి పిల్లలకు తాగిస్తే వారి ఎముకలు దృఢంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎముకలు పెళుసుగా ఉన్నవారిలో ఈ చిట్కా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.
◆గర్భిణులు, బాలింతలకు మునగాకు ఆహారంగా ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు. పాలిచ్చే తల్లులకు మునగాకును పోపు గా చేసి వండి పెడితే పాలు పెరుగుతాయి.
◆గుప్పెడు మునగాకులను గ్లాస్ నీటిలో వేసి ఐదు నిమిషాలు ఉడికించి అందులో తగినంత ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల ఉబ్బసం, దగ్గు వంటి వ్యాధులు తగ్గిపోతాయి.
◆మునగాకు రసం ఒక స్పూన్ తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరేచనాలు తగ్గిపోతాయి.
◆మునగాకు పేస్ట్ ను ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు మచ్చలు తగ్గి ముఖం కాంతివంతం అవుతుంది.
చివరగా……
మహిళలకు సంబంధించిన రుతు సంబంధమైన ఇబ్బందులకి కూడా మంచి మందు ఈ మునగాకు. కాల్షియన్ని భర్తీ చేయడం ద్వారా జుట్టు పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది. కబట్టి కాయలే కాదు ఆకు కూడా అదరహో అనేలా ఫలితాలు చేకూరుస్తుంది.