మునగచెట్టు చిన్న చిన్న ఆకులతో ఉండే ఈ చెట్టు కాయలు అనేక రకాలుగా వండుకుంటాం. అలాగే ఈ చెట్టు ఆకులు కూడా అంతే ప్రాముఖ్యత కలిగినవి. అనేక ఆయుర్వేద లక్షణాలు కలిగిన ఈ చెట్టు ఆకులు కషాయంగా లేదా ఆకుకూరగా కూడా ఉపయోగిస్తారు. ఎలాంటి మునగాకు తింటే పోషకాలు పూర్తిగా అందుతాయో చూద్దాం. మునగాకు లో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. మనం డబ్బులు పెట్టికొనే ఏ ఆకుకూరలో కూడా విటమిన్లు ఈ స్థాయిలో ఉండవు. అలాగే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ అధికంగా ఉంటుంది.ఒక్క మునగాకు మూడొందల రకాల వ్యాధులను నయంచేసే గుణాలు ఉంటాయి. కంటిచూపు తగ్గకుండా ఉండాలన్నా, కంటి ఆరోగ్యం బాగుండాలన్నా మునగాకు వారానికి ఒకసారైనా తినాలి.
పంటలతో పాటు పెరిగే మునగాకు తినవద్దు. ఎందుకంటే పంటలకు అధిక దిగుబడి కోసం కొట్టే పురుగుమందుల అవశేషాలు ఉండడంవలన అవి తింటే అనారోగ్యం పాలవుతాం. అందుకే బయట అమ్మే లేదా పొలాల్లో దొరికే వాటికంటే ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉపయోగించడం మంచిది. విటమిన్ ఎ,కె, సి, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్లు , ఫైబర్ పుష్కలంగా ఉన్న మునగాకు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. మునగాకు తినడంవలన కీళ్ళనొప్పులు తగ్గుతాయి. రక్తహీనత తగ్గించి రక్తాన్ని వృద్ధి చేస్తాయి. చర్మసౌందర్యానికి పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను పటిష్టం చేసి అలసట, ఒత్తిడి తగ్గిస్తాయి. అనేక రకాల వ్యాధులు దర్శకుడు చేరకుండా రోగనిరోధక వ్యాధిని పెంచుతాయి. పురుషులలో వీర్యవృద్దికి, స్ర్తీలలో పెరిగిన అధిక నీరును తగ్గిస్తుంది.