ఇదొక మాయదారి వ్యసనం….. దీన్ని వాడితే ప్రాణాలు గాల్లో పెట్టి బ్రతికినట్లే….. పక్షవాతం, హార్ట్ ఎటాక్ లు వస్తాయి……

సాధారణంగా ఆవకాయ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. మంచి రుచికరంగా నెయ్యి  వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కానీ ఆరోగ్యకరంగా ఉండాలి అనుకున్న వారు ఆవకాయకు దూరంగా ఉండాలి. ఆవకాయ నిల్వ ఉంచడానికి అందులో ముఖ్యంగా ఉపయోగించేది ఉప్పు. కేజీ ముక్కలకు పావు కేజీ ఉప్పు వరకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇంత మోతాదులో ఉప్పును ఉపయోగించడం వలన ఆవకాయ సంవత్సరం మొత్తం నిల్వ ఉండడానికి సహాయపడుతుంది. ఉప్పులో ఉండే ఘటుకు ఫంగస్లు, వైరస్లు పట్టకుండా ఉప్పుఘటు సహాయపడుతుంది.

మరియు పైనుంచి ఏమి చేరకుండా నూనె కాపాడుతుంది. కనుక ఆవకాయల్లో నూనె, ఉప్పు మోతాదులు ఎక్కువగా ఉంటాయి. దీనితోపాటు ఎర్ర కారం ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు ఎక్కువగా నష్టం కలిగిస్తాయి. లాభాన్ని కలిగించే విధంగా మెంతిపిండి, ఆవపిండి ఉంటాయి. ఆవకాయలు నూనె కంటే కూడా ఉప్పు వలన ఎక్కువ నష్టం కలుగుతుంది. దీనివలన దంతాలు పుచ్చడానికి, ఎనామిల్ పోవడానికి, చిగుళ్ళు కదిలిపోవడానికి, దంత సంబంధ సమస్యలు రావడానికి ముఖ్యంగా ఆవకాయ కారణం.

సాధారణంగా ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారం తింటే పొట్టలో ఉండే హెల్ప్ ఫుల్ బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. దీనివల్ల చాలా చాలా ప్రోబయాటిక్స్ డ్యామేజ్ అయిపోతాయి. రోగ నిరోధక శక్తి బాగా డౌన్ అయిపోతుంది‌. రక్తనాళాలు గట్టిపడడానికి, బీపీ పెరగడానికి కూడా కారణం ఉప్పు ఎక్కువ తినడం. అందువలన పక్షవాతాలు, కీళ్ల నొప్పులు, హార్ట్ ఎటాక్ లు రావడానికి కారణం. మరి నూనె ఎక్కువ మొత్తంలో వాడటం వలన కొలెస్ట్రాలకు కారణం అవుతుంది. అన్ని రకాలుగా శరీరానికి నష్టం కలగడానికి ఉప్పు కారణం. నిల్వ ఆవకాయలు ఎక్కువ మొత్తంలో ఉప్పు, కారం, నూనె, పులుపు కలిసి ఉండడం వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది.

వీటికి ఆల్టర్నేట్ గా  సాధారణంగా ఇన్స్టెంట్ పచ్చడ్లు తయారు చేసుకోవచ్చు. ఇవి అంత రుచికరంగా ఉండవు కానీ ఆల్టర్నేటివ్గా వాడుకోవచ్చు. సంవత్సరం పొడుగునా పచ్చి మామిడికాయలు ఇప్పుడు లభిస్తుంది. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. అదేవిధంగా కాలిఫ్లవర్ తో, క్యాబేజీతో, దోసకాయతో కూడా పచ్చడి పెట్టుకోవచ్చు. వీటి వలన ఎక్కువ నష్టం కూడా జరగదు. వీటిల్లో కాస్త నువ్వుల పొడి వాడితే పచ్చి కారం ఘాటు తగ్గుతుంది. ఉప్పులేని లేటు తెలియకుండా తేనె గాని చెరుకు పానకం కలుపుకోవచ్చు…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top