ఎన్నో సంవత్సరాల నుండి పేరుకుపోయిన జిడ్డు మొత్తం తీసి ముఖానికి కాంతివంతంగా చేస్తుంది

ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. దాని కోసం రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తారు. కొందరు పార్లర్కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటే కొంతమంది నేచురల్ చిట్కాలు ఉపయోగిస్తుంటారు. మార్కెట్లో దొరికే క్రీములు అనేక రకాల   కెమికల్స్ కలిగి ఉంటాయి. వాటిని ఉపయోగించడం వలన  అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ నాచురల్ చిట్కా  ఉపయోగించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

ఈ చిట్కా  ఉపయోగించినట్లయితే ముఖంపై ఉండే జిడ్డు మొత్తం పోయి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. దీనిలో వాడే పదార్థాలు  మన ఇంట్లో దొరికేవి  కాబట్టి ఎటువంటి కెమికల్స్ ఉండవు. దీని వలన చర్మానికి ఎటువంటి హాని కలుగదు.  దీని కోసం  పండిన అరటిపండు తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. దానిలో ఒక గ్లాసు నీటిలో వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇంట్లో ఉడికిన అన్నం ఉంటే కొంచెం అన్నం వేసుకోవాలి.

అన్నం లేకపోయినట్లయితే రెండు చెంచాల బియ్యం వేసుకొని అరటిపండు తొక్కలతో పాటు ఉడికించుకోవాలి. రెండు కలిపి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత దాన్ని  మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ  పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత దీంట్లో రెండు చెంచాల కార్న్  ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి.   ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకోవడానికి ముందు ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి.

30 నిమిషాల వరకు ఉండనివ్వాలి. ఆరిన తర్వాత ఈ ప్యాక్ పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతుంది. ఊడిపోకుండా ఇంకా ఏమైనా మిగిలితే  తడి  క్లాత్ సహాయంతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల ముఖం పై ఉండే జిడ్డు  మొత్తం పోతుంది. స్కిన్ టైట్గా అయ్యి  యాంటీ ఏజింగ్ లక్షణాలు తగ్గుతాయి.  ముఖం పై  పేరుకుపోయిన జిడ్డు మురికి  నిమిషాల్లో మాయమైపోతాయి.  ముఖంపై ఉండే మొటిమలు, మొటిమల వల్ల వచ్చిన మచ్చలు, డార్క్ సర్కిల్స్, డెడ్ స్కిన్ సెల్స్ వంటి సమస్యలు తగ్గుతాయి.

ఇందులో ఉపయోగించినవన్ని నేచురల్ పదార్థాలు కాబట్టి దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని అన్ని వయసులవారు ఉపయోగించవచ్చు. అలాగే అన్ని స్కిన్ టైప్స్ వారు కూడా ఉపయోగించుకోవచ్చు. దీనిని ఉపయోగించడానికి ముందు పడదు అనుకున్న భయం ఉన్నవారు అయితే ప్యాచ్ టెస్ట్  చేసుకుని ఉపయోగించడం మంచిది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top