ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్యతో చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు సన్నగా ఉండాలి. అందంగా కనపడాలని ఆశ పడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం తీసుకునే ఆహారం బిజీ లైఫ్ స్టైల్ వలన అధిక బరువు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. బరువు తగ్గడం కోసం రకరకాల వ్యాయామాలు, డైట్ ఫాలో అవుతున్నారు అయినప్పటికీ బరువు తగ్గటం లేదు. కొంతమంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడెక్ట్స్ కూడా ఉపయోగిస్తున్నారు.
ఇటువంటి ప్రొడక్ట్స్ ఉపయోగించడం వలన బరువు తగ్గకపోగా అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ గా ఇంట్లో ఉండే పదార్థాలతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని పావు చెంచా కలోంజీ విత్తనాలు వేసుకోవాలి. కలోంజీ విత్తనాలు శరీరంలో అధిక కొవ్వు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయి. తర్వాత అరచెంచా ధనియాల వేసుకోవాలి ధనియాల కూడా శరీరంలో అధిక బరువు సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.
అలాగే జీర్ణ సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గిస్తాయి. ఒక చెంచా సోంపు వేసుకోవాలి. సోంపు శరీరంలో కొవ్వు పేరుకోకుండా సహాయపడుతుంది. జీర్ణ సంబంధ సమస్యను తగ్గించి మనం తిన్న ఆహారం జీర్ణం అయ్యేటట్లు చేస్తుంది. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడం అనేది జరగదు. అధిక బరువు సమస్యలను తగ్గించడంలో సోంపు అద్భుతంగా పనిచేస్తుంది. గిన్నెలో గ్లాసు నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని వడకట్టుకోవాలి.
తర్వాత దీనిలో ఒక చెంచా స్వచ్ఛమైన తేనెను కలుపుకోవాలి. మార్కెట్లో దొరికే తేనే కంటే పట్టుతేనె తెచ్చుకుంటే ఫలితం బాగుంటుంది. కావాలనుకుంటే దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున తాగడం వలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగి అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు. జిమ్, డైట్ ఏం చేసినా బరువు తగ్గడం లేదు అనుకునే వారు ఒకసారి ఈ డ్రింక్ తాగి చూడండి. వెంటనే బరువు తగ్గుతారు. ఈ డ్రింక్ తో వరుసగా పదిహేను రోజులపాటు తాగినట్లయితే ఈజీగా బరువు తగ్గుతారు. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు.