గుప్పెడు ఈ ఆకులతో ఇలా సూప్ చేసుకుని తాగితే అద్భుతమైన కేశసంపద మీ సొంతమవుతుంది

ఇప్పట్లో అందరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం, జుట్టు పలుచన అవడం, చుండ్రు ఈ సమస్యలకు ఎన్ని చేసినా ఫలితం మాత్రం ఉండటం లేదు. షాంపూలు, కండిషనర్లు, నూనెలు ఎన్నో ఉత్పతులు మార్కెట్లో ఉన్నా అందరిని ఆకర్షించగలుగుతున్నాయ్ కానీ 100% ఫలితాన్ని ఏది ఇవ్వడం లేదు. జుట్టు ఊడిపోవడం చాలా మంది మహిళల్లో మానసిక సమస్యకు కూడా దారి తీరుస్తుంది. నిరాశ, నిస్పృహ లు ఆవరించి మానసిక వొత్తిడిలోకి నెట్టేస్తాయ్. అప్పటిదాకా తక్కువగా ఉన్న ఈ సమస్యలు మానసిక ఒత్తిడి వల్ల విశ్వరూపాన్ని ప్రదర్శించి ఇంకా ఎక్కువగా జుట్టు రాలిపోయేలా చేస్తాయి. మనం చెప్పుకోబోయే ఆకులతో సూప్ చేసుకుని తీసుకోవడం వల్ల అనూహ్యంగా జుట్టు పెరగడం మొదలెడుతుంది. అంతే కాదు దృడంగా తయారవుతుంది కూడా.

దీనికోసం మనకు కావలసినది మునగాకు అంటే ఆశ్చర్యమేస్తుంది. కానీ నిజం  వంటింట్లో ఉన్న పదార్థాలతో  మునగాకు ఉపయోగించి సూప్ తయారుచేసుకుని తీసుకోవడం కేవలం జుట్టుకె కాదు, మధుమేహం ఉన్నవారికి కూడా ఎంతో ఉత్తమం. ఇంకా మునగాకులో ఒమేగా3  ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి ఎంతో దోహదం చేస్తాయి.

మరి మునగాకు సూప్ తయారు విధానం ఎలానో చూడండి.

కావలసిన పదార్థాలు

  • మునగాకు : గుప్పెడు
  • జీలకర్ర : ఒక స్పూన్
  • మిరియాలు : ఒక స్పూన్
  • ఉల్లిపాయలు : చిన్నవి నాలుగు
  • వెల్లుల్లి  రెబ్బలు : నాలుగు
  • ఎండు మిర్చి : ఒకటి లేదా రెండు
  • ఉప్పు : సరిపడా
  • నీళ్లు : అరలీటరు

తయారు విధానం

మునగాకును శుభ్రంగా కొమ్మలనుండి వేరు చేసి నీళ్లలో కడగాలి. చిన్న రొటిలో జీలకర్ర మిరియాలు వేసి దంచుకుని పొడి చేసుకొని విడిగా తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి ని రొటిలో వేసి  కచ్చాపచ్చాగా దంచుకోవాలి.

స్టవ్ మీద కడాయ్ పెట్టి అందులో స్పూన్ ఆవు నెయ్యి వేయాలి. అందులో ఎండుమిర్చి దంచుకున్న ఉల్లి, వెల్లుల్లి మిశ్రమం వేసి పచ్చి వాసన పోయేదాక వేయించాలి. ఇపుడు అందులోకి జీలకర్ర మిరియాల పొడి వేసి మరొక్క నిమిషం వేయించాలి. అందులోకి మునగాకు వేసి నిమిషం పాటు మగ్గించి అందులోకి అరలీటర్ నీళ్లు పోయాలి. తగినంత ఉప్పు వేసి సుమారు 5 నుండి 10 నిమిషాల సేపు మరిగించి దించేయాలి. ఇష్టమైతే టమాటా కూడా వేసుకోవచ్చు.

ఇదేంటి ఇలా ఉంది అనిపించవచ్చు కానీ ఒక్కసారి ఒక వారం రోజులు వాడి చూడండి రోజు ఒక కప్పు ఈ సూప్ తాగుతూ ఉంటే జుట్టు పెరుగుదలను మీరే నమ్మలేరు.

చివరగా….

మునగాకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మన మునగాకుతో, కచ్చితంగా ప్రయత్నించండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top