మునగాకు- ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్

భారతదేశంలో మునగాకుకు ఒక ప్రత్యెక స్థానం ఉంది. మునగాకును అన్నీ రాష్ట్రాలవారు విరివిగానే వాడతారు. చేసే విధానంలో మార్పు ఉండొచ్చు కాని.. ఈ ఆకు యొక్క విలువలు అందరి దృష్టిలో ఒక్కటే.. బహుశా ఆయుర్వేద శాస్త్రం పుట్టిన స్థలం మహిమో ఏమో కాని.. ఈ ఆకుకు వంటింటి ఔశధం అని పేరు కూడా ఉంది. ఎన్నో ఔషదగుణాలు కలిగి ఉన్న మునగ, ఆయుర్వేదంలో మందుగా కూడా వాడతారు. ఈ ఆకులో యాంటి బయోటిక్ గుణాలు అధికంగా ఉన్నందున, అనేక జబ్బులను నివారించాడానికి వాడుతుంటారు.ముఖ్యంగా పెరిగే పిల్లల్లో, అనారోగ్యంతో బాధపడేవారికి మునగాకు ఒక టానిక్ లా పనిచేస్తుంది.

  • ఈ ఆకు రసంలో కొద్దిగా పాలు పోసుకొని, తాగితే, ఎముకల పెరుగుదల, రక్తశుద్ది జరుగుతుంది.
  • మునగాకును,కీరదోసతో,క్యారెట్ తో కలిపి జ్యూస్ చేసి తాగితే మూత్ర సంబంధిత వ్యాధులకు నివారణ లభిస్తుంది.
  • విటమిన్లు, ఇనుము, కాల్షియం వంటివి మునగాకులో అధికంగా ఉన్నందున  గర్భిణీలకు ఎక్కువగా వండి పెడుతుంటారు.
  • మునగాకు పూలతో,ఆవు  పాలని కలిపి కషాయం చేసి తాగితే, సెక్స్ బలహీనత సంబంధిత ఇబ్బందులకు మందులా పనిచేస్తుంది.

మునగాకు మందులానే కాకుండా,, సౌందర్య వర్దినిలా కూడా వాడతారు. కొద్దిగా నిమ్మరసంలో ,మునగాకు రసాన్ని కలిపి ఒక పేస్టు లా చేసి ముఖానికి పట్టించాలి. ఒక 15 నిమిషాల తర్వాత చన్నీలతో కడిగేసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.అలానే మొటిమలు, తెల్లని, నల్లని మచ్చల నుంచి ఉపశమనం పొందుతారు.

మునగాకులో,కాయల్లో విటమిన్ ఎ, బి,ఫాటీయాసిడ్స్,నికోటిన్ యాసిడ్స్, ఇతర యాసిడ్స్ లభిస్తాయి. పూలల్లో గ్లూకోస్, సుక్రోసే, అమీనో యాసిడ్స్, సిట్రిక్యాసిడ్, ఇక మరెన్నో యాసిడ్స్ లబిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే..మునగాకు ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు…………

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top