సాధారణ పాలకు పాలపొడి మంచి ప్రత్యామ్నాయమా?

పాలపొడి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు ఎంతవరకు నిజం తెలుసు.  పొడి పాలు సాధారణ పాలను ఆవిరి చేయడం ద్వారా తయారయ్యే పాల ఉత్పత్తి.  పాలు చాలా తక్కువ కాలం నిల్వవుంటాయి. తాజా పాలను క్రమం తప్పకుండా పొందలేకపోతున్న వారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.

ఇది ఎక్కువగా వెన్న తీసేసిన పాలతో తయారుచేయబడుతుంది. మనము ఉపయోగిస్తునపుడు కొంతవరకు ఆ పదార్థాలకు చిక్కదనాన్ని ఇస్తుంది.  అందువల్ల సాధారణ పాలు కంటే కొంతమంది దీనిని ఇష్టపడతారు.

పాలపొడిని ఎక్కువగా పిల్లలకోసం తయారయ్యే క్యాండీలు, చాక్లెట్లు మరియు గులాబ్ జామున్ వంటి భారతీయ స్వీట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు.  చాలా మంది ప్రజలు సాధారణ పాలకు బదులుగా పాలపొడిని ఉపయోగిస్తారు, అయితే కొలెస్ట్రాల్ మరియు చక్కెర అధికంగా ఉన్నందున పాలపొడిని ఉపయోగించడంలో పరిమితి ఉండటం మంచిది.

అంతేకాదు నిల్వ వల్ల అందులో బాక్టీరియా ఉత్పన్నం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అంత శ్రేయస్కరం కాదనే చెప్పవచ్చు. తాజా పాలకంటే పాలపొడి వాడటం మంచిదా కాదా మీరే చూడండి.

◆ పొడి పాలలో ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ ఉంటుంది.  ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ ధమనుల గోడకు అంటుకుని రక్త నాళాలకు హాని కలిగించే మైనపు లాంటి పదార్థాన్ని తయారుచేస్తుంది.  పాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ అనే కృత్రిమ పదార్ధాన్ని పొడి పాలలో కలుపుతారు, ఇవేగుండె జబ్బులకు మొదటి మెట్టు అవుతాయి. కాబట్టి అత్యవసరం అయితే తప్ప పాలపొడిని ఉపయోగించకూడదు.

◆ పొడి పాలు తాజా పలు రెండు ఓకేవిధంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇది ఒకే విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది మరియు పానీయాలు మరియు మిల్క్ షేక్‌లలో సులభంగా కలపవచ్చు.  కానీ, రుచి విషయానికి వస్తే, ఇది సాధారణ పాలకు చాలా భిన్నంగా ఉంటుంది ముఖ్యంగా పొడి పాలను తీసుకునేటప్పుడు దీని రుచి నోటికి సయించనట్టు ఒకోసారి అనిపిస్తుంది కూడా.

◆ పొడి పాల కోసం పొడిని కొనడం తో పోలిస్తే తాజా పాలు లేదా ప్యాక్ చేసిన పాలు ఖరీదు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చాలామంది తల్లులు పాలపొడి కొని వేడినీటిలో వేసి చిన్న పిల్లలకు పడుతూ ఉంటారు. ఇది సులువైన మార్గం అవడం వల్ల దీన్నే అనుసరించడం వారికి పరిపాటి అవుతుంది. తాజా లేదా ప్యాక్ చేసిన పాలతో పోలిస్తే, ఇది సగం ధరలో లభించడం మరియు ఎప్పుడైనా ఏ సమయంలో అయినా ఉపయోగించుకోగలగడం వల్ల దీనివైపు మొగ్గు చూపేవారు ఎక్కువ. అయితే ఇది చాలా ప్రమాధకరమైనదిగా చెప్పవచ్చు. ముఖ్యంగా పిల్లల విషయంలో అసలు వాడకూడనిది.

◆పౌడర్ పాల ఉపయోగం వ్యాప్తి చెందడం వెనుక కారణం ఇందులో తక్కువ లాక్టోస్ కలిగి ఉండటం. లాక్టోస్ శరీరానికి సరిపడని వారు పాల పొడితో తయారుచేసుకుని ఉపయోగించుకోవచ్చు.  అలాగే ఈ పాలపొడి ద్వారా తయారు చేసుకునే పాలు జీర్ణ సంబంధ సమస్యలను కలిగిస్తాయి, తొందరగా జీర్ణమవకపోగా జీర్ణాశయ గోడలను బలహీన పరుస్తాయి.

చివరగా…..

పాలపొడి ద్వారా తయారయ్యే పాలు అత్యవసర సమయాల్లో వినియోగించుకుంటే ఆరోగ్యం మీద అంత ప్రభావం ఏమి ఉండదు, అదే తాజా పాలకు ప్రత్యామ్నాయంగా రోజూ  వాడితే తప్పకుండా అనారోగ్యం వెంట వస్తుంది..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top