ఇలాచేస్తే మీ ఊపిరితిత్తులలు 100 ఏళ్ళ వరకు ఆరోగ్యంగా, క్లీన్ గా ఉంటాయి.. lungs detox remedies

మనిషి ఊపిరితిత్తులు రోజుకి ఇరవై  నాలుగ్గంటలు పనిచేస్తాయి. అవి ఇరవై వేలనుండి ముప్ఫై వేలసార్లు ఊపిరి తీసుకుంటాయి.  అందులో ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డయాక్సైడ్ వదులుతుంది. ఇవి నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. కానీ పొగతాగే అలవాటు మన ఊపిరి తిత్తులు మరియు గుండెకు చాలా ప్రమాదకరం. పొగతాగడం వలన మొదట మన వెంట్రుకలు, చర్మం, మెదడుపై ప్రభావం చూపుతుంది.

ఇప్పటి రోజుల్లో పొగతాగుతున్న వారికంటే మానేసిన వారిసంఖ్య ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. పొగతాగడం అలవాటు మానేయడం కష్టం అనేవారికి  సాధ్యమే అని ఈ పరిశోధనలవలన తేలింది. సిగార్ మరియు పొగాకులో నికోటిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం మన శరీరం, మెదడుపై తీవ్రప్రభావం చూపించి కొంచెం కొంచెం అలవాటు  పెంచుకునేలా  చేస్తుంది.

ఒకటినుండి రెండు అంటూ ఒక్కటి కాల్చడం మొదలుపెడతాం.ఇలా తాగినపుడు పొందిన సంతృప్తి కంటే ఎక్కువగా అయినప్పుడు మాత్రమే పూర్తి మనశ్శాంతి పొందగలం. అలాగే శరీరంలో నికోటిన్ స్థాయి తగ్గినపుడు మెదడు సిగరెట్ కాల్చమని పదేపదే సూచిస్తుంది. ఒక వ్యక్తి కాల్చే ఒక్క సిగరెట్  వల్ల అతని శరీరంలోకి 4000 రకాల రసాయనాలు విడుదలవుతాయి. ఇందులో 400 రకాలు విషపూరితం అయినవి . అలాగే 43పైగా కెమికల్స్  కాన్సర్ కారకాలు. ఈ కెమికల్స్ రక్తాన్ని కూడా కలుషితం చేస్తాయి. ఈ కలుషిత రక్తం శరీరంలోపల అవయాలను పాడుచేస్తుంది.  ఆప్రభావం చర్మంపై మొదలయి చిరాకు, ఒత్తిడి ఎక్కువవుతుంది. పురుషులలో శీఘ్ర స్కలనం, స్ర్తీలలో సంతాన సమస్యలు పెరుగుతాయి. నెమ్మదిగా ఆకలి తగ్గిపోయి శరీరం బలహీనపడుతుంది. పోషకవిలువలు గ్రహించడం తగ్గిపోవడం వలన అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. దీనివలన ఇమ్యూనిటి పూర్తిగా బలహీనపడుతుంది.

ఆరోగ్యంగా ఉన్న ఊపిరితిత్తులు లేత గులాబీరంగులో ఉంటే కలుషితం అయినవి నలుపుగా మారిపోతాయి. నల్లగా మారిపోయిన లంగ్స్ రక్తాన్ని నల్లగా చేస్తాయి.

లంగ్స్ శుభ్రపడాలంటే మనం చేయవలసింది  చిన్న చిట్కా. దానికోసం మనకు కావలసింది దాల్చిన చెక్క పొడి, అల్లం రసం‌, తేనె, కాయిన్ కారంపొడి, నిమ్మరసం.. కాయిన్ పెప్పర్ అనేది లావుగా, పొడవుగా ఎర్రగా ఉండే ఒకరకం మిరపకాయలు పొడి. ఇది ఊపిరి తిత్తులు, గుండె, లివర్, మూత్రపిండాలు , కడుపులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఒక పావులీటర్ నీటిని బాగా మరిగించి అందులో పావు టేబుల్ స్పూన్ కాయిన్ పెప్పర్ పొడి, పావుస్పూను దాల్చిన చెక్క పౌడర్, ఒక టేబుల్ స్పూన్ అల్లంరసం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం(అరచెక్క) రెండు స్పూన్ల తేనె కలిపి రాత్రిపూట పడుకునే అరగంట ముందు టీలా వేడివేడిగా తీసుకోవాలి.

ఇది ఊపిరితిత్తులలో చేరిన మలినాల్ని తగ్గించి శరీరంలో మెటబాలిజం పెంచుతుంది. అంతేకాకుండా శరీరంలో పొగతాగడం వలన ఏర్పడే  కణాల నష్టాన్ని సరిచేస్తుంది. ఈ డ్రింక్ శరీరాన్ని శుభ్రపరచడంతో పాటు రక్తాన్ని కూడా శుభ్రంచేస్తుంది. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే ఊపిరితీసుకోవడంలో ఉన్న తేడా గమనిస్తారు.. హెర్బల్ చ్యవన్ ప్రాస్ కూడా తింటుంటే ఊపిరితిత్తులను శుభ్రంచేయడంలో సహాయపడుతుంది. నీటిని ఎక్కువగా తాగుతూ పొగతాగడాన్ని మొదట సగానికి, తర్వాత నెమ్మది నెమ్మదిగా పూర్తిగా మానేస్తే శుభ్రపడిన లంగ్స్ ఆరోగ్యవంతంగా మారతాయి. మంచి నడక, వ్యాయామం అలవాటు చేసుకుని ధూమపానానికీ దూరంగా ఉండాలి. ఈ డ్రింక్ క్రమంతప్పకుండా తాగుతూ ఈ చిట్కాలు పాటిస్తే ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top