మనం తినే ఆహారాన్ని శుభ్రపరిచి విషపదార్థాలు బయటకు పంపాలంటె శరీరంలో కిడ్నీలు ఆరోగ్యం గా ఉండడం.చాలా అవసరం. అలాంటి కిడ్నీలలో చాలా వరకూ పేరుకుపోయే టాక్సిన్లు, విషవ్యర్థాలను బయటకు పంపకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే కిడ్నీలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నాయని తెలిపే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.
అలా తెలుసుకోవడం వలన కిడ్నీలు ప్రమాదంలో పడకుండా కాపాడుకోగలం. కిడ్నిలు ప్రమాదంలో ఉంటే మనకు కనిపించే పది ముఖ్యమైన లక్షణాలేంటో చూద్దాం. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎప్పుడూ నీరసంగా, నిస్సత్తువగా ఉంటారు. ఏ పని చేయాలన్నా అలసట, బలహీనంగా ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మన శరీరం బయటనుండి విటమిన్ డి ని గ్రహించలేదు. దీనివలన శరీరంలో ఎడినాయిడ్స్ అనే హార్మోన్ విడుదలవదు.
దానివలన శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో మనకు రక్తహీనత వస్తుంది. కండరాలు, మెదడు బలహీనంగా మారిపోయి అస్తమానం నిస్సత్తువ, అలసట అనిపిస్తుంది. రోజువారీ మనం తీసుకునే నీటివలన మన మూత్రపిండాలు, మూత్రం యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం లేదని మన మూత్రాన్ని బట్టి తెలుసుకోవచ్చు. మూత్రపిండాలు ఆరోగ్యంగా పనిచేయకపోతే మూత్రం రంగు మారిపోతుంది.
మూత్రం ముదురు రంగులో ఉన్నా, మూత్రం అనేక రంగుల్లో అంటే నలుపు, ఎరుపు, నారింజ రంగుల్లో వస్తున్నా, మూత్రంలో రక్తం పడినా, మూత్రపిండాలు సరిగా లేవని అర్థం. మూత్రపిండాల్లో సమస్య ఉన్నవారిలో తరచూ కడుపునొప్పి వస్తుంది. నోటిలో పూత కూడా కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్టు తెలిపే సూచనే. కళ్ళ కింద వాపులు, నిద్రలేమి సమస్య కూడా తరచూ ఏర్పడతాయి. చర్మంపై దద్దుర్లురావడం, చర్మం పొడిబారడం కూడా ఉంటుంది. అంతేకాకుండా కిడ్నీలు ఉండేచోట ఎవరో సూదులతో పొడిచినట్టు అనిపిస్తుంది.
అలాగే కాళ్ళలో తరుచూ దురదలు, నొప్పులు వస్తున్నా కిడ్నీ సమస్యలు ఉన్నట్టు. నోటికి రుచిని చూసే లక్షణం తగ్గిపోతుంటుంది. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థపదార్థాలు బయటకు పోకుండా అలాగే ఉండిపోతాయి. బయటకు వెళ్ళకపోవడం వలన ఆ వ్యర్థ పదార్థాలు శరీరమంతా వ్యాపించి శరీరం నీరు చేరి వాచినట్టు ఉంటుంది. కిడ్నీలు పాడయిపోతే కాళ్ళు, చేతులు లావుగా వాపులు వచ్చి ఉబ్బినట్టు ఉంటాయి.
ఇలాంటి సమస్యలు ఉన్నవారు కిడ్నీలను శ్రద్దగా పరీక్షించుకోవాలి. ఇలాంటి సమస్యలు ఉన్నవారికి శరీరంలో రక్తప్రసరణ తగ్గిపోతుంది. గుండె, ఇతర అంతర్గత అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. ఈ లక్షణాలలో ఏవి కనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి కిడ్నీ పరీక్షలు చేయించుకోండి.