జిల్లేడు అందరికీ తెలిసిన మొక్క పని జిల్లేడు యొక్క ఔషధ గుణాల గురించి మనకి పెద్దగా అవగాహన ఉండదు. అవి తెల్ల జిల్లేడు మరియు ఎర్ర జిల్లేడు. జిల్లేడు అపోసైనేసి కుటుంబానికి చెందింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎర్ర జిల్లేడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తెల్ల జిల్లేడు తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రథసప్తమి రోజున జిల్లేడు పత్రాలు ధరించి నదీ స్నానం చేస్తే చాలా పుణ్యం అని పెద్దలు చెబుతారు. జిల్లేడు చర్మ సమస్యలను తగ్గిస్తుంది మరియు కీళ్ళనొప్పుల సమస్యను తగ్గిస్తుంది.
జిల్లేడు పాలను సేకరించేటప్పుడు అవి కళ్ళ లో పడకుండా జాగ్రత్త పడాలి. కారణం ఏమిటంటే జిల్లేడు పాలు విషంతో సమానం. ఇవి కళ్ళల్లో పడడం వలన కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. సేకరించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సేకరించిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ఆకులు కీళ్ళ నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. జిల్లేడు ఆకులు పెద్దవి సేకరించి ఆకులను మెత్తని పేస్ట్ లా చేసుకొని దీనిలో కొంచెం ఉప్పు వేసి నొప్పులున్నచోట కట్టు కడితే నొప్పులు తగ్గిపోతాయి.
జిల్లేడు ఆకులకు ఆముదం రాసి వేడి చేసి కీళ్ళకు కడితే కీళ్లనొప్పులు ప్రథమ దశలో ఉంటే తగ్గిపోతాయి. జిల్లేడు ఆకుల పొడిని దంచి పొడి చేసి గాయాలకు అప్లై చేస్తే పుండ్లు, గాయాలు త్వరగా తగ్గిపోతాయి. పీడకలలుతో బాధపడుతున్న పిల్లలు పెద్ద వారికి తలకింద తెల్ల జిల్లేడు యొక్క వేరు పెట్టేవారు. అలా చేయడం వలన కలలు రాకుండా భయం తగ్గుతుందని నమ్మేవారు. అలా చేయడం వలన గ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయి. తెల్ల జిల్లేడును సిరిసంపదలకు చిహ్నం గా భావిస్తారు.
అందుకే కొంతమంది ఇంటి ముందు ఈ మొక్కలను పెంచుకుంటారు. తెల్లజిల్లేడు వేరు గణపతి నివాసం అని భావిస్తారు. సెగగడ్డలు, వేడి కురుపులు ఉన్నచోట ఈ ఆకులను పసుపుతో కలిపి నూరి వాటిపై అప్లై చేస్తే తగ్గిపోతాయి. అరికాళ్ళపై బొబ్బలు వస్తే జిల్లేడు పాలను పూస్తే తగ్గిపోతాయి. ఈ జిల్లేడు పాలు విషపూరితమైనవి. ముఖ అందాన్ని పెంచడంలో చాలా బాగా సహాయపడుతాయి. వీటిని కంట్లో పడకుండా జాగ్రత్తగా ముఖానికి పూయడం వల్ల జిల్లేడు పాలను పసుపుతో కలిపి నూరి ముఖానికి పూయడం వలన ముఖంపై ఉన్న మచ్చలు పోతాయి.
ముఖం కాంతివంతంగా అందంగా మార్చుతుంది. తెల్ల జిల్లేడు వేరు పైన ఉండే బెరడు నూరి బోదకాలుపై రాస్తే బోదకాలు సమస్య తగ్గుతుంది. చర్మం తెగిపోయి రక్తం కారుతున్నప్పుడు జిల్లేడు పాలను గాయాలపై అప్లై చేసే రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ పాలను కూడా సెగ గడ్డలపై అప్లై చేస్తే శరీరంలో అక్కడక్కడా గడ్డలు కడితే ఈ ఆకులను నూనె రాసి, వేడి చేసి కడితే గగ్గలలో గడ్డలు తగ్గిపోతాయి. కడుపునొప్పి వంటి సమస్యలకు ఆకులను వేడి చేసి పెట్టడం వలన కడుపునొప్పి తగ్గుతుంది. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న జిల్లేడు అనేక రకాల ఆయుర్వేద చికిత్సలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.