స్త్రీలలో నెలసరి సమస్యలు అధికమయిపోతున్నాయి. ఒక్కొక్కరికి నెల రెండు నెలలు తేడా వస్తుంటుంది. ఇలా ఇర్రెగ్యులర్ అయ్యేవారికి రెగ్యులర్ అవ్వడానికి సమయం ప్రకారం రావాలంటే మందులు వాడకుండా నాచురోపతిలో నాచురల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం.
రోగాలను తగ్గించాలంటే మంచి ఆహారం తినాలి. ప్రకృతి ప్రసాదించిన పోషకాలు, మాంసకృత్తులు నిండిన ఆహారం తీసుకోవాలి. మధ్యాహ్నం నచ్చిన ఆహారం తిన్నా రాత్రి, ఉదయంమాత్రం మంచి ఆహారానికి మారండి. పుల్కాలు మధ్యాహ్నం లేదా రాత్రి ఆహారంలో తీసుకోండి. కూరలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి.
కూరగాయలతో ఒక కూర సోయా చిక్కుడుగింజలు మధ్యాహ్నం తప్పకుండా తినండి. రాత్రి నానబెట్టి కుక్కర్లో ఉడికించాలి. వీటిని మిఖతా కూరగాయలతో కలిపి వండుకోవచ్ఛు. ఈస్ట్రోజన్ హార్మోన్ సరిగ్గా విడుదలవడినికి హైపో ఈస్ట్రోజన్ లెవల్స్ పెంచడానికి ఉపయోగపడుతుందని డాక్టర్ ల అభిప్రాయం.
ఉప్పు తగ్గించి ఆకుకూరలు తినండి. మధ్యాహ్నం ముఫ్ఫై శాతం రాత్రి ఉదయం డెభ్భై శాతం ఉడికించిన ఆహారం తీసుకోండి. ఉదయాన్నే కాఫీ, టీలు మానేసి వెజిటబుల్ జ్యూస్ తాగండి. రెండు కారట్స్ , రెండు బీట్రూట్, రెండు టమాటాలు, ఒక కీరా సగం ముక్క కలిపి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ తీసుకుని తాగాలి. తేనె నిమ్మరసం కలిపి తాగండి. విటమిన్స్, మినరల్స్ అవయవాల పనితీరు మెరుగుపరిచే గ్లాండ్స్ పెరుగుతాయి.
ఈ జ్యూస్ 250 మిగ్రాములు చాలు. తర్వాత ముప్పావు గంట తర్వాత మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. పెసలు, బొబ్బర్లు మొలకెత్తిన గింజలతో పాటు ఐదారు ఖర్జూరాలను తినండి. బొప్పాయి, జామ లాంటి పండ్ల ముక్కలు ఒక కప్పు తినండి. ఈ మొలకెత్తిన గింజలు హర్మోనల్ ఇన్ బాలన్స్ తగ్గిస్తాయి. వీటిలో మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి.
బాడీలో గ్లాండ్స్, ఓవరీస్ హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి. ఇలా క్రమంతప్పకుండా తీసుకోవడం వలన నెలసరి సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. ఇలా రెండు మూడు నెలలు తప్పకుండా చేస్తే చాలు. ఉదయం ఈ పంఢృ మొలకెత్తిన గింజలను, మధ్యాహ్నం పుల్కాలు తీసుకుని సాయంత్రం ఐదారు గంటలకల్లా పండ్ల రసం తాగొచ్చు.
కొబ్బరినీళ్ళు కూడా తాగొచ్చు. వీలైనంత సహజ ఆహారం తీసుకోండి. తర్వాత రెండు ఏవైనా జామ, బొప్పాయి లాంటి పండ్లు తీసుకోండి. ఇలా చేస్తూ మంచి వ్యాయామం కూడా చేస్తూ ఉంటే త్వరలోనే నెలసరి సమస్యలు తగ్గిపోతాయి.