జ్వరం వలన నోటికి రుచి పోయి ఏమి తినాలి అనిపించకపోయినా, ఆకలి వేయకుండా ఉన్నా వేరే ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాతయినా, మీకు ఆహారం తినాలి అనిపించకపోయినా, అన్ని రకాల సమస్యలను తగ్గించే ఒక అద్భుతమైన ఆయుర్వేద వైద్యం గురించి ఈ రోజు తెలుసుకుందాం.ఈ రెమిడి నోటిని బాగుచేయడమే కాకుండా రెండే నిమిషాల్లో ఆకలి వేసేలా చేస్తుంది. మీ శరీరం ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. ఇది ఇప్పటి చిట్కా కాదు మన అమ్మమ్మల కాలం నుంచి ఉపయోగిస్తున్న చిట్కా. ఈ రెమిడీ వాడడం వలన జీర్ణశక్తిని పెంచి కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మలబద్దక సమస్య తగ్గిస్తుంది.
గ్యాస్ను కూడా బయటకు పంపించేస్తుంది. అందులో మొదటిది నిమ్మకాయ. నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండి, నోటిపూత, రుచి లేకుండా ఉండడానికి దూరం చేస్తుంది. రుచి కళికలు యాక్టివేట్ చేయడమే కాకుండా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇప్పటి కాలంలో అవసరమైన విటమిన్ సి, మరియు ఇమ్యూనిటీని అందించడంలో నిమ్మకాయ ముందు ఉంటుంది. చిట్కా కోసం అరచెక్క నిమ్మకాయ తీసుకుని దానిలో గింజలు తొలగించాలి. ఆ నిమ్మచెక్క మీద రెండు చిటెకెడు అంత నల్ల మిరియాలు పొడి, తర్వాత చిటికెడు సైంధవ లవణం, తర్వాత నల్ల ఉప్పు వెయ్యాలి. వీటన్నింటినీ నిమ్మచెక్కకు అంటుకునేట్టు అద్ది తర్వాత స్టవ్ మీద కట్టర్ లేదా చిమ్నీ సహాయంతో వేడెక్కించాలి.
ఇలా వేడెక్కిన తర్వాత ఐదునిమిషాలకు స్టవ్ ఆపేసి ఆ నిమ్మచెక్క చల్లారిన తర్వాత డైరెక్ట్గా చప్పరించొచ్చు లేదా రసాన్ని ఒక గిన్నెలోకి పిండితే ఒక స్పూన్ నిమ్మరసం వస్తుంది. దానిని నెమ్మదిగా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇలా చేయడంవలన నోరు బాగుండడంతో పాటు బాగా ఆకలి వేస్తుంది. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపరుస్తుంది. కరోనా వైరస్ లేదా నార్మల్ ఫ్లూ సమయంలో ఇలా నిమ్మరసాన్ని తీసుకోండి. ఇలా విటమిన్ సి లభించడంతో పాటు చర్మ, అవయవ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని పెంచుతుంది.