వేసవికాలం వచ్చిందంటే అందరికీ సన్ టాన్ వలన రంగు మారిపోయి ఉంటుంది. బట్టలు ఉన్న భాగంలో ఒక రంగు బట్టలు లేని భాగంలో ఒక రంగులో ఉంటారు. దీనిని తగ్గించుకోవడం కోసం పార్లర్ కి వెళ్తే బ్లీచ్ పెడతారు. బ్లీచ్ పెట్టించుకోవడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా జిడ్డు, మురికి, సన్ టాన్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. దీని కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక చెంచా కోల్గేట్ పేస్టు వేసుకోవాలి.
ఈ చిట్కా కోసం వైట్ గా ఉండే ఏ పేస్ట్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఈ పేస్ట్, ఒక చెంచా పంచదార, రెండు చెంచాల తేనె వేసి బాగా కలుపుకోవాలి. పంచదార ముఖంపై స్క్రబ్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. తేనె ముఖాన్ని మాయిశ్చరైజ్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖంలో గ్లో రావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మూడింటిని బాగా కలిపి కాళ్లు, చేతులు, మెడ, గిలకలు అన్ని నల్లగా మారిన భాగాలలో అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి.
ఆరిన తర్వాత కొంచెం వాటర్ వేసి చేతితో సర్కులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల స్కిన్ పై ఉండే జిడ్డు, మురికి, సన్ టాన్, డెడ్ స్కిన్ సెల్స్ పోయి మీ చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ ప్యాక్‌ను ముఖంపై ట్రై చెయ్యాలి అనుకున్నప్పుడు ఒకసారి పాచ్ టెస్ట్ చేసి ఎటువంటి రియాక్షన్స్ లేకపోతే అప్పుడు ట్రై చేయండి. ఈ ప్యాక్ చర్మంపై ఉండే జిడ్డు, మురికి పోగొట్టి చర్మం తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోవడానికి సాయం చేస్తుంది.
పార్లర్‌కి వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి బ్లీచింగ్ చేయించుకున్నా పెద్ద తేడా ఏమీ లేదు అని బాధపడటం కంటే ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే మీ చర్మం అందంగా, కాంతివంతంగా తీర్చిదిద్దుకోవచ్చు. సన్ టాన్ వలన చాలా రంగు మారిపోయాము అనుకున్నవారు ఒకసారి ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది. దీనిలో ఎటువంటి కెమికల్స్ ఉపయోగించ లేదు కాబట్టి ఈ ప్యాక్ ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు కూడా అవసరం అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి ఫలితం ఉంటుంది.