మంచి నీరు త్రాగి బాడీ హీట్ తగ్గించు కోలేని వారికి?

కొంతమందికి చిన్నప్పటి నుంచి  నీరు త్రాగడం అలవాటు లేక కావాల్సిన నీరు తాగలేరు. ఎక్కువ నీళ్ళు త్రాగాలి అనుకున్నా వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. దీనివలన రోజుకు 7 నుండి 8 గ్లాసులు నీళ్లు మాత్రమే తాగుతాం. నీరు రోజుకు 5-6 లీటర్లు తాగకపోతే ఒంట్లో వేడి చేస్తుంది.  అలాంటప్పుడు  నీటికీ ప్రత్యామ్నాయంగా వేరే ఏమైనా తీసుకోవాలి. వేరే ఏదైనా అంటే సబ్జా నీళ్ళు, బార్లీ నీళ్లు, పంచదార నీళ్లు అనుకుంటారు. కానీ అవి కాదు. మంచినీరుకు బదులుగా కొబ్బరినీళ్లు తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్లు అందరూ  ఇష్టంగా తాగుతారు కదా!

పెద్ద కొబ్బరి బొండం అయితే  అర లీటర్ వరకు నీళ్లు వస్తాయి. ఒకసారి గ్లాసు చొప్పున రెండు మూడు సార్లు తాగవచ్చు లేదా చిన్న కొబ్బరి బొండం తీసుకొని ఒకేసారి తాగవచ్చు. బూడిద గుమ్మడికాయ  రసం. పెద్ద సైజు ఒక  గుమ్మడికాయ తెచ్చుకొని రెండు  మూడు రోజులు జ్యూస్  చేసుకుని తాగవచ్చు.  బూడిద గుమ్మడికాయ రసంలో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. బూడిద గుమ్మడికాయలో   95 శాతం వాటర్ ఉంటుంది. నీరు త్రాగ లేనివారు  నీరుకి బదులుగా బూడిదగుమ్మడికాయ  రసం తాగవచ్చు. ఒక పెద్ద గుమ్మడికాయ 15 నుంచి 20 రూపాయలు  ఖర్చుపెట్టి తెచ్చుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఒంట్లోని వేడిని తగ్గించికోవచ్చు.

సొరకాయ జ్యూస్ సొరకాయలు కూడా 96 శాతం  వాటర్ కంటెంట్స్  ఉంటాయి.  నీరు తాగలేక ఉన్నప్పుడు  సొరకాయ జ్యూస్ తాగవచ్చు.  కీరదోస కూడా జ్యూస్ చేసుకుని తాగొచ్చు.  చక్కగా మిక్సీ పట్టుకొని ఫిల్టర్ చేసి తేనె కలుపుకొని ఈ జ్యూస్ తాగవచ్చు. దీనివల్ల కూడా ఒంట్లో   చలువ చేస్తుంది. నీరు త్రాగ లేనప్పుడు  నీటికి ఏదైనా ఫ్లేవర్ ఆడ్ చేసుకుని తాగొచ్చు.  కొన్ని తులసి ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి నీటిలో వేసుకుని  కొద్దిసేపు అలా వదిలేయండి. తర్వాత దానిలో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగండి. తులసి ఆకుల్ని వేసి ఉంచడం వలన తులసి ఫ్లవర్ నీటిలోకి దిగుతుంది. దాని వల్ల నీరు తాగేటప్పుడు వికారంగా అనిపించదు.

లేదా స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు పోసుకొని దానిలో ఒక చిటికెడు జీలకర్ర వేసుకుని ఐదు, పది నిమిషాల పాటు నీటిని మరిగించాలి. తర్వాత వాటిని ఫిల్టర్ చేసుకొని నిమ్మరసం పిండుకొని త్రాగాలి.  ఇలా తాగినట్లయితే  జీలకర్ర ఫ్లేవర్  నీటిలోకి దిగడం వల్ల నీళ్లు తాగేటప్పుడు  వాంతి వచ్చినట్టు కానీ వికారంగా కాని అనిపించదు. ఇలా చేయడం వలన మనం నీటిని డైరెక్ట్గా తాగకపోయినా  మన శరీరానికి కావలసినంత నీరుని ఏదో ఒక రూపంలో అందించవచ్చు. దీనివలన ఈ  డిటాక్షినేషన్  సక్రమంగా జరుగుతుంది. ఒంట్లో వేడి తగ్గి, డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ రావు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top