ముఖంతో పాటు మొత్తం శరీరం అంతా తెల్లగా మారేందుకు చాలామంది సున్నిపిండి వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఇది శరీరంపై ఉన్న మృతకణాలను తొలగించి మెరుపు అందిస్తాయి కానీ చర్మం మంచి రంగు రావడానికి ఉపయోగపడవు. కానీ ఇప్పుడు చెప్పబోయే చిట్కా పాటించండి. మీ చర్మం రెండు రెట్లు ఎక్కువ మెరుపును సొంతం చేసుకుంటుంది. దీని కోసం మనం ఒక బంగాళదుంప తీసుకోవాలి. దీనిపై ఉండే తొక్క తీసేసి దీనిని మెత్తగా తురుముకోవాలి లేదా మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు దీని నుండి రసాన్ని తీసుకోవాలి. బంగాళాదుంప అందుబాటులో లేకపోతే ఏదైనా పండు రసాన్ని ఉపయోగించవచ్చు. దీనికోసం టమాట, బొప్పాయి, కమలా వంటి ఏదైనా ప్రూట్ ఉపయోగించవచ్చు.
ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో కొంచెం ఓట్స్ వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఓట్స్ పౌడర్ లేనివారు గోధుమపిండి వాడుకోవచ్చు. బంగాళాదుంప రసంలో ఓట్స్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి. అలాగే అందులో ఒక స్పూన్ మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి. మిల్క్ పౌడర్ అందుబాటులో లేకపోతే పాలు వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసుకోవాలి. రోజ్ వాటర్ పడనివారు నీటిని ఉపయోగించుకోవచ్చు. ప్రతి పదార్థానికి మనం ఆల్టర్నేటివ్ చెప్పుకున్నాం కనుక మన శరీరానికి సరిపడే పదార్థాలతో ఈ చిట్కా పాటించాలి. వీటన్నింటినీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. బంగాళ దుంప రసం తీసిన తురుమును ఒక గిన్నెలో వేసుకొని అందులో ఒక స్పూన్ బియ్యంపిండి వేసుకోవాలి. రెండింటినీ బాగా కలిపి ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించండి.
ఇది ముఖంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది. నలుపుదనాన్ని తగ్గించి చర్మంపై ఉండే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ నివారిస్తుంది. తర్వాత కలిపి పెట్టుకున్న ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత టిష్యూ లేదా చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ చిట్కా ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. ముఖం పై ఉండే మొటిమలు మచ్చలను తగ్గిస్తుంది. చర్మంలో ఉండే అధికంగా ఉన్న నూనెలను తొలగించి మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. చర్మ రంగును రెండు రెట్లు అధికంగా తెల్లగా మెరిసేలా చేస్తుంది.