పొట్ట ఉబ్బరం ఉంటే మనం ఇక ఏ పనిపై శ్రద్ధ చూపించలేము. రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం చేస్తుంటాం. అలా కాకుండా మధ్య మధ్యలో ఏదొకటి తింటుంటారు. ఫ్రెండ్స్ ఆఫర్ చేస్తే మధ్యలో టీ, టిఫిన్ అంటుంటారు. ఇలా తినడంవలన జీర్ణం అవడానికి సమయంలేక కడుపుబ్బరం సమస్య మొదలవుతుంది. దీనివలన ఇబ్బంది పడుతుంటారు. అందుకే ఉదయం టిఫిన్‌కి, భోజనానికి మధ్యలో ఏమీ తినకండి. ఇలా తినడంవలన ముందు తిన్న ఆహారం సగం జీర్ణమయ్యాక మళ్ళీ ఆహారం తింటాం.
అది మొదటి ఆహారంతో కలిసి మళ్ళీ జీర్ణమవ్వవలసి వస్తుంది. దీనివలన కడుపులో సమస్యలు మొదలవుతాయి. ఇలా తిన్నపుడు గ్యాస్ తయారయి అది పైకి తంతుంది. ఇది ఛాతీలో పట్టినట్లు అవుతుంది. దీనినే కడుపుబ్బరం అంటారు. ఉదయం తిన్న తర్వాత మధ్యాహ్నం వరకూ ఏమీ తినకండి. మళ్ళీ మధ్యాహ్నం ఆకలివేసాక తినండి. మధ్యలో మంచినీళ్ళు తాగండి. ఇలా భోజనం తర్వాత ఏమైనా తినాలనుకుంటే అప్పుడే తినండి. తర్వాత తినడం అలవాటు చేసుకోవద్దు.
అలాగే మధ్యాహ్నం కూడా భోజనం తర్వాత ఏమీ తినవద్దు. రెండు గంటలకోసారి మంచినీళ్ళు తాగండి. ఈ సమస్య వలన మలవిసర్జన కష్టమవడం, గ్యాస్, ఎసిడీటీ వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే భోజనం చేసేటప్పుడు ఆహారం బాగా నమిలి తినండి. తినేటప్పుడు నీళ్ళు తాగకండి. అలా తాగడంవలన ఆహారాన్ని జీర్ణంచేసే హైడ్రోక్లోరిక్ యాసిడ్ డైల్యూట్ అయిపోతుంది. జీర్ణంచేయవరసిన జీర్ణరసాలు చల్లారిపోవడం వలన తిన్న ఆహారం ఎక్కువ సేపు నిల్వ ఉంటుంది.
ఆహారం నిల్వ ఉంటే పులిసిపోవడం జరుగుతుంది. నీటిని అప్పుడప్పుడు గ్లాసు, గ్లాసు తాగితే పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. కొంతమంది భోజనానికి ముందు చాలా సేపు నీళ్ళు తాగరు. తినేటప్పుడు తిగడంవలన ఆహారం ఎక్కువ తీసుకోరు. తీసుకున్న తాగిన నీటీవలన కడుపు నిండుగా ఉబ్బరంగా ఉంటుంది.అందుకే నీటిని భోజనానికి భోజనానికి మధ్యలో మాత్రమే తీసుకోవాలి. అలాగే కారం, మసాలాలు, జంక్ ఫుడ్లకు దూరంగా ఉండాలి. త్వరగా జీర్ణమయ్యే ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లకు మారాలి. ఒకసారి కలిపితీసుకోకూడని వ్యతిరేక ఆహారాలను తీసుకోకూడదు. ఉదాహరణకు పాలు, పెరుగు. పాలు, నిమ్మకాయ