ప్రతిఒక్కరు ఏదొక సమయంలో తలనొప్పి తో బాధపడే ఉంటారు. ప్రధానంగా తలనొప్పి కి కారణం ఒత్తిడి, ఎక్కువగా అలసిపోవడం లేదా సరైన భంగిమలో పడుకోకపోవడం, మరియు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, తినేతాగే పదార్థాలలో మార్పులు రావడం కూడా కారణం కావచ్చు.
ఒక్కోసారి దగ్గు, జలుబు, జ్వరం లాంటి ఇన్పెక్షన్ కూడా తలనొప్పి కి కారణమవుతాయి. ఇలాంటి సాధారణ తలనొప్పి కొంతసేపటికి ఉపశమనం ఉంటుంది. కానీ ఎక్కువ సేపు లేదా రోజుల పాటు ఉంటే అది మైగ్రేన్ తలనొప్పి కావచ్చు.
మైగ్రేన్ తగ్గడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మైగ్రేన్ తలనొప్పి అనేక కారణాల వలన వస్తుంది. మరియు ఈ సమస్య ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది.
ఒక్కసారి తలనొప్పి మొదలయితే చేసేపనిపై ఏకాగ్రత కష్టమయిపోతుంది. వీటివలన టాబ్లెట్స్ ఒక్కటే పరిష్కారం అనిపిస్తుంది. మనం మందులపై ఆధారపడడం మొదలయితే కిడ్నీలు కడుపుపై ప్రభావం పడుతుంది. మైగ్రేన్కి మందులెపుడూ పరిష్కారం కాదు.
ఈ సమస్య ను జీవనశైలిలో మార్పులవలన, ఇంటి చిట్కాలు వలన మాత్రమే తగ్గించుకోగలం. దీనికోసం కావలసిన పదార్థాలు బాదం నూనె, పెప్పర్ మెంట్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్.
అన్నింటికంటే ముందు ఒక గిన్నెలో ఒక చెంచా బాదంనూనెలో ఐదుచుక్కల పెప్పర్ మెంట్ ఆయిల్ వేసుకుని ఆ మిశ్రమాన్ని నుదుటిపై ఐదునుండి ఆరునిమిషాలు మసాజ్ చేస్తే తలనొప్పి తగ్గుతుంది.
పెప్పర్మంట్ ఆయిల్ బ్రెయిన్ లోని నరాలకు ఉపశమనం కలగచేస్తుంది. దానివలన తలనొప్పి తగ్గుతుంది. ఐదారు నిమిషాలు గడిచాక ఒకచెంచా చందనం పౌడర్లో ఒక చెంచా రోజ్ వాటర్ కలిపి అందులో ఐదారు చుక్కలు పెప్పర్మంట్ ఆయిల్ వేసి నుదుటిపై అప్లై చేయాలి.
పదినిమిషాల తర్వాత కడిగేయండి. చందనం ఆంటే పూర్వకాలం నుండి ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.దీనిలోని చల్లదనాన్నిచ్చే గుణం మెదడులోని నరాలను శాంతపరిచి తలనొప్పి రాకుండా చేస్తుంది.
మైగ్రేన్ ఉన్నవారు నూనె లేదా చందనం పొడిని పడుకునేముందు లేదా లేచిన తర్వాత పదినిమిషాలు మసాజ్ చేసుకుంటే సరిపోతుంది.
మైగ్రేన్ వలన మెదడులోని నరాలలో వాపు లేదా బలహీనంగా తయారవుతుంది. దీనివలన తలనొప్పి తో పాటు ఆ సమయంలో కళ్ళు వెలుగును చూడడం కూడా కష్టమయిపోతుంది.
దీనివలన కళ్ళచుట్టుపక్కల మరియు తలలో నొప్పి వస్తుంది. దీనికి స్వచ్ఛమైన ఆవునెయ్యి, బాదం నూనె చాల బాగా సహాయపడతాయి. రెండింటిలో ఏదో ఒకదాని ని డ్రాపర్ సహాయంతో రోజూ రెండు చుక్కలు ముక్కులో వేయాలి.తర్వాత నెమ్మదిగా ఊనిరి పీల్చి వదలాలి.
ఇలా చేస్తే నెయ్యి లేదా నూనె సగం గొంతులోకి సగం మెదడులోకి చేరుతుంది. దీనివలన తలనొప్పి నుండి ఉపశభనం లభిస్తుంది.ఈ చిట్కాలు వలన కేవలం ఏడు రోజుల్లో మంచిఫలితం కనిపిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది.