ఒక్కసారి తీసుకుంటే మీ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ గా మారిపోతుంది, దగ్గు-జలుబు,ఛాతిలో కఫం పూర్తిగా మాయం

ఈ కరోనా వల్ల మనకు తెలిసిన విషయం ఏమిటంటే  బలమైన రోగనిరోధక శక్తి మన శరీరానికి చాలా అవసరమని అందరికీ తెలియజేసింది. కరోనా వైరస్ జలుబు, దగ్గుకి, క్యాన్సర్ వంటి ఏ జబ్బులతోనైనా పోరాడేది స్ట్రాంగ్ ఇమ్యూనిటీ అని అర్థమైంది. పవర్ ఫుల్ గురించి రెమిడి గురించి మీతో పంచుకుంటున్నాను. ఇది రోగ నిరోధక శక్తిని పెరిగేలా చేస్తుంది. అలాగే కరోనా వైరస్ నుండి బయటపడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మీకు వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు, ఛాతిలో కఫం, గొంతులో ఇన్ఫెక్షన్ గొంతులో మంట పెడుతూ ఉంటే దీనికోసం మీరు ఎటువంటి యాంటీబయోటిక్స్ వేసుకొనే అవసరం లేదు. ఈ ఒక్క చిట్కా పాటిస్తే సరిపోతుంది.

ఇలాంటి చిన్నచిన్న అనారోగ్యాలు కాకుండా భయంకరమైన వైరస్ నుండి కూడా మిమ్మల్ని కాపాడుతుంది. ఇదే కాకుండా మీకు కరోనా పాజిటివ్ వస్తే ఈ డ్రింక్ క్రమం తప్పకుండా తీసుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో రెండు గ్లాసుల నీళ్ళు పోయాలి. నీళ్లు వేడెక్కాక ఇందులో హాఫ్ స్పూన్ వాము వేయండి. వాము దగ్గు, ఛాతిలో కఫం నిర్మూలిస్తుంది. మళ్లీ పెరగకుండా ఉండడానికి సహాయపడుతుంది. దగ్గు, జలుబు సమస్య త్వరగా తగ్గిపోతుంది. మీ ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి. అందులో పావు చెంచా సొంఠి పొడి వేయాలి. ఇది అన్ని కిరాణా షాపుల్లో దొరుకుతుంది.

అల్లం కంటే సొంటిలో ఔషధ గుణాలు ఎక్కువ. మీకు కనుక సొంటి పొడి దొరకకపోతే  మీరు పావు స్పూన్ అల్లం తురుము వేయాలి. సొంటి పొడి జలుబు, దగ్గు, జ్వరం తగ్గించడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి పెంచడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. రెండు లవంగాలు కూడా దంచి పొడి వేయాలి. అందులో చిటికెడు మిరియాల పొడి ఛాతిలో కఫం, గొంతు నొప్పి, దగ్గు, జలుబు తగ్గించడంలో ఈ రెండు పొడులు చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పటి వరకు చెప్పిన మోతాదుల్లో ఇవన్నీ వేసి బాగా మరిగించండి. తర్వాత ఇందులో చిటికెడు నల్ల ఉప్పు కూడా వేయండి. మీ దగ్గర లేకపోతే పింక్ సాల్ట్ లేదా సైంధవలవణం వాడవచ్చు. కిచెన్ సాల్ట్ వాడకూడదు.

నల్ల ఉప్పు చాతిలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించడంలో సహాయపడుతుంది. ఈ నీటిని బాగా మరిగించి అరగ్లాసు నీళ్లయ్యే వరకూ ఉంచాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఈ నీటిని వడకట్టుకోవాలి ఈ కషాయాన్ని వేడివేడిగా టీలా తీసుకోవాలి. మీరు టీ, కాఫీ ఎలా తాగుతారో అలాగే తాగండి. మీరు పిల్లలకి కషాయం ఇవ్వాలి అనుకుంటే ఇది పావు కప్పు మాత్రమే ఇవ్వండి. ఈ కషాయాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు. జలుబు, దగ్గు తగ్గేంతవరకు దీన్ని క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే మంచి ఉపశమనం లభిస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top