అందరిలో ఒక ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. రోజుకు రెండు పూటలు తినాల లేక మూడు పూటలు తినాల అని ఆలోచిస్తూ ఉంటారు. మూడు పూటలు తినడం వల్ల బరువు పెరుగుతారని భయం కూడా ఉంటుంది. కానీ మన శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి. అతిగా తినడం వలన కూడా సమస్యలు వస్తాయి. కొందరు వండిన ఆహారం మిగిలిపోతుంది, వేస్ట్ అయిపోతుంది అని ఎక్కువగా తినేస్తుంటారు. లేదా బరువు పెరిగి పోతున్నామని భయపడి మొత్తానికి తినడం మానేస్తారు.
ఇలా చేయడం వలన ఇరిటేషన్, అదొక రకమైన ఇబ్బంది, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు వస్తాయి. ఇలా మనల్ని మనం ఇబ్బంది పెట్టుకొని ఆకలితో ఉండటం కంటే ఆకలి వేసినప్పుడు తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. మన శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ 15 రోజుల నుంచి నెల రోజుల వరకు మాత్రం ఉండగలుగుతాం తర్వాత ఇబ్బంది తట్టుకోలేక మళ్ళీ మామూలుగా తినేస్తూ ఉంటాము. రోజుకు మూడుసార్లు తిన్నా ఆకలి వేసినప్పుడు తక్కువగా తిన్నట్లయితే ఆకలి తీరుతుంది.
ఈ శరీరంలో కేలరీలు కూడా తక్కువగా వెళ్తాయి. 12 నుంచి 18 గంటల వరకూ ఏమీ తినకుండా ఉందామని ప్రయత్నాలు చేస్తారు. ఆహారం తీసుకోవడంలో ఒకేసారిగా అంత ఎక్కువగా ఇవ్వడం వలన తలనొప్పి, ఇరిటేషన్, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు వస్తాయి. అలా తినడం మానేయడం కంటే కేలరీలు ఉన్న ఆహారం లేదా ఒక పెద్ద గ్లాస్ తో మజ్జిగ తీసుకోవడం వలన ఎటువంటి నష్టం ఉండదు. మజ్జిగ తీసుకోవడం వలన అసలు కేలరీలు వెళ్ళవు. మరియు శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
శరీరంలోకి ప్రోబయోటిక్స్ వెళ్తాయి. అసిడిటీని తగ్గిస్తుంది. శరీరం చల్లబడుతుంది. రాత్రి తినకుండా ఉండడం కంటే ఇలా మజ్జిగ తాగి పడుకోవడం మంచిది. ఏమీ తిననప్పుడు మజ్జిగ లేదా మీకు ఇష్టమైనది ఏమైనా తీసుకొని పడుకున్నట్లు అయితే తలనొప్పి , ఇరిటేషన్, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆహారం రెండుసార్లు లేదా మూడుసార్లు తీసుకున్న తక్కువ కేలరీలతో తీసుకొని ఆహారం తీసుకో లేని సమయంలో ఖాళీ కడుపుతో ఉండకుండా మజ్జిగ లేదా ఇంకేమైనా తీసుకోవడం వలన బరువు పెరగడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
ఏమి తాగకుండా తినకుండా 12 నుంచి 18 గంటల పాటు ఉపవాసం చేసినట్లయితే నీరసం, చికాకు వంటివి ఏర్పడతాయి. అందుకే బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఒక పెద్ద గ్లాస్ తో మజ్జిగ తీసుకోవడం వలన ఆకలి కూడా చచ్చిపోతుంది. ఆహారం తినాలని వాంఛ తగ్గుతుంది. ఇక నుంచైనా మొత్తానికి తినడం మానేయడం కంటే ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం మంచిది.