అర గ్లాస్ తాగితే చాలు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు 100శాతం రోగనిరోదకశక్తి పెరుగుతుంది.ఇది నిజం

ఈరోజు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఒక డ్రింక్ గురించి తెలుసుకుందాం. ఈ కరోనా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈడ్రింక్ తయారుచేసుకొని తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. తయారు చేసుకోవడానికి మనకు అందుబాటులో ఉండే పదార్థాలే. కాకపోతే ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అంటే ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి.ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో తిప్పతీగ కాండం మూడు ముక్కలు వేయాలి. తిప్పతీగ తమలపాకు రూపంలో ఉంటుంది. తిప్పతీగ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. లక్షణాలు సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో చేరే సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. తిప్పతీగలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అల్లం చిన్న ముక్క తీసుకుని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి.అల్లం లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి విటమిన్-ఇ , మెగ్నీషియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతు నొప్పి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

అల్లం వంట గదిలో తప్పనిసరిగా ఉంటుంది . ఆ తర్వాత సోంపు ఒకస్పూన్ వేయాలి.సోంపు జీర్ణక్రియను శక్తివంతం చేస్తుంది. మన శరీరానికి అవసరమైన విటమిన్ సి లో 20% సోంపు ద్వారా లభిస్తుంది. కొంతమంది మధ్యాహ్నం భోజనం అయ్యాక నములుతూ ఉంటారు. వ్యాధినిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. తిప్పతీగ ఆకులు, కాండం, సోంపు, అల్లం రసం నీటిలో చేరడానికి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా మరిగించాలి. సిమ్లో పెట్టి మరిగించాలి. ఈ డ్రింక్ శరీరంలో  వచ్చే వ్యాధులను తగ్గించటానికి సహాయపడుతుంది. తిప్పతీగ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటుంది. కానీ మనకు అది తిప్పతీగ అని తెలియక ఉపయోగించం. తిప్పతీగ కావాలి అనుకుంటే  ఎక్కువగా ఆయుర్వేద ఔషధం షాపుల్లో లభిస్తుంది.

అనేక ఆయుర్వేద మందులు తయారీలో వాడుతూ ఉంటారు. ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి వాటి గురించి కూడా తెలుసుకుంటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సహజపదార్థాలు వాడాల్సిందే. ఇక ఆ తర్వాత బెల్లం ముక్క వేయాలి. బెల్లం లేదా పటికబెల్లం వాడితే మంచిది . సెలీనియం , జింక్ శరీరంలో చేరి అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగటానికి ప్రోత్సాహం చేస్తుంది. తర్వాత ఒక గ్లాసులో వడగట్టుకుని ప్రతిరోజూ ఒక గ్లాసు తాగితే సరిపోతుంది .

అన్ని పదార్థాలలో వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. చిన్నపిల్లలు నుంచి పెద్దవారి వరకు ఈ డ్రింక్ తాగవచ్చు. శరీరంలో విషపదార్థాలు అన్ని బయటకు పోతాయి. ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గుతాయి. మీరు కూడా తయారు చేసుకుని తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తిప్పతీగ మనకి ఎక్కువగా దొరికినప్పుడు ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ లో ఉంటుంది.అది కూడా వాడవచ్చు ప్రతిరోజు తయారుచేసుకొని తాగితే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top