స్రీల ముఖ సౌందర్యం కోసం.. గృహ చిట్కాలు కొన్ని..

స్త్రీలు ప్రత్యేకంగా అందానికి ఎంతో  ప్రాముఖ్యత ఇస్తారు. అయితే కాలుష్య ప్రభావమో…లేక తినే ఆహార పదత్తుల్లో మార్పో తెలీదు కానీ,  మొహం మీద అవాంచి రోమాలు, అసహ్యంగా కనిపించే మొటిమలు.. అందాన్ని అడ్డుకునేలా మచ్చలు వస్తున్నాయి. వీటిని అరికట్టడం కోసం అనేక రకాల కాస్మెటిక్స్ వాడటం, బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగం ఇదే పనిగా పెట్టుకున్నారు మహిళలు. అయినా ఇలాంటి ప్రకృతి విరుద్ధంగా వస్తున్న వస్తువులతో అందాన్ని పెంపొందించు కోవాలనుకోడం మూర్కత్వమే!ఎందుకంటే.. ఇవన్నీ తాత్కాలికంగానే ప్రయోజనాలను కలిగిస్తాయి.అలానే దీర్గ కాలంలో దుష్ఫలితాలను కూడా ఇస్తాయి. ఇలా కాకుండా సహజ పద్ధతిలో ప్రకృతి అందించే వస్తువులతోనే ముఖం పైన వస్తున్న మచ్చలకి, అలాగే మొటిమలకి చెక్ పెట్టండి.. ఎలానో ఇప్పుడు చూదాం!

  • నిమ్మరసం, తులసిరసం సమ పాళల్లో కలుపుకొని, ముఖానికి పట్టించాలి. ఒక అరగంట తర్వాత, గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా రోజు చేస్తే కొన్ని రోజుల్లోనే నల్ల మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
  • మునగాకుల రసంలో, నిమ్మరసాన్ని సమానంగా కలుపుకొని, ప్రతిరోజు ముఖానికి మెడకి రాసుకోండి. ఇలా చేస్తే, మీ చర్మం మృదువుగా, మొటిమలు తగ్గి అందంగా ప్రకాశిస్తుంది.
  • దాల్చిన చెక్క పొడి కొద్దిగా తీసుకొని, అందులో ఒక అరా చెంచా నిమ్మరసం కలిపి ముద్దలా చేసుకొని.. ముఖంపైన పూతల పూసుకోవాలి. అరగంట ఆగి ముఖాన్ని గోరువెచ్చని నీటితో కదిగేసుకొంటే,  ఒక మాసంలోనే మీరు మొటిమలు లేని చర్మాన్ని గమనిస్తారు.
  • పాలు, నిమ్మరసం, కలిపి పేస్టు చేసుకోవాలి.దీన్ని ముఖంపై రాసుకొని ఒక 20 నిమిషాల తర్వాత కదిగేసుకోండి..చర్మం కాంతివంతంగా.. సౌందర్యవంతంగా శోభిస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top