3 సార్లు తింటే మోకాళ్ళ నొప్పి,కీళ్ల నొప్పి,నడుమునొప్పి,రక్తహీనత,డయాబెటిస్ తొలగి100 ఏళ్ళు జీవిస్తారు

కీళ్ల, కండరాల నొప్పి ఇప్పుడు ముప్ఫైలలో ఉన్న వారిలో కూడా కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యలు. వీటినుండి ఉపశమనం కోసం అనేక రకాల మందులు వాడుతూ ఉంటాం. వాటివలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా భరిస్తాం. కానీ ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలతో  కీళ్ళు, కాళ్ళనొప్పులు నుండి ఉపశమనం పొందవచ్చు. అవేంటంటే నల్ల శనగలు, బాదం, బెల్లం. ఇవి నొప్పులు నుండి ఉపశమనం కల్పించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. వీటిని ఉపశమనం కోసం ఎలా వాడాలో తెలుసుకుందాం.

దీనికోసం ఒక స్పూన్ శనగలు, నాలుగైదు బాదం పప్పులను తీసుకుని ఒక గిన్నెలో నీళ్ళుపోసి  నానబెట్టాలి. వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే బాదం పొట్టు తీసి శనగలతో కలిపి నమిలితినాలి. తర్వాత చిన్న బెల్లం ముక్క కూడా తినాలి. ఇలా తినడం వలన వీటి బెనిఫిట్స్ శరీరానికి అంది త్వరలోనే కీళ్ళు, నడుము, మెడ, ఆర్థరైటిస్ నొప్పులు తగ్గిస్తాయి. డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటాయి.

బెల్లం కీళ్ల నొప్పులు, కండరాల దృఢత్వాన్ని పెంచుతుంది.  అందువల్ల, ప్రతిరోజూ బెల్లం ముక్క తినడం వల్ల మీరు ఆర్థరైటిస్‌తో బాధపడుతుంటే మీకు అవసరమైన ఉపశమనం లభిస్తుంది, ఇది కీళ్ళు మరియు కణజాలాలలో నొప్పి మరియు మంటను కలిగించే ఒక  పరిస్థితిని తగ్గించడంలో దోహదపడుతుంది..

నల్ల శనగలు ఎముకలకు వరం. దీనిలో ఫాస్ఫేట్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ మరియు జింక్ యొక్క మంచి ప్రాపర్టీస్ కాకుండా, నల్ల శనగలలో కాల్షియం మరియు విటమిన్ కె కూడా అధికంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది.

బాదంలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి.  వివిధ రకాల గింజలు మరియు విత్తనాలలో.  వాల్నట్, బాదం, అవిసె గింజలు, చియా గింజలు మన యొక్క  రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన కీళ్ళు మరియు బంధన కణజాలాలలో మంటను తగ్గించడంలో నొప్పి వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది.

వీటిని క్రమం తప్పకుండా మూడురోజులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top