చిన్నపిల్లల్లో లేదా పెద్దవారిలో ఛాతిలో కఫం పట్టేసి అది ఊపిరి సలపనివ్వదు. దీనివలన శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. కఫం వలన దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా వస్తాయి. అలాంటప్పుడు ఇటువంటి చిట్కాలతో జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. శ్వాస నాళాలను శుభ్రపరిచుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల వలన చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. కరోనా తీవ్రంగా విజృంభించినప్పుడు చాలామంది ఆక్సిజన్ అందక చనిపోయారు. కానీ ఈ చిట్కాలు పాటించడం వలన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. చాతిలో చేరిన కఫం సమస్యలను నివారిస్తుంది.
జలుబు, దగ్గుని నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడు చెప్పబోయే తప్పకుండా పాటించండి. ఇప్పుడు చిట్కా కోసం స్టవ్పై రెండు గ్లాసుల నీటిని పెట్టుకొని అందులో ఒక స్పూన్ వాము వేయాలి. అందులో ఒక గుప్పెడు పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కర్పూరం బిళ్ళలు ఒక నాలుగైదు వేసుకోవాలి. కర్పూరం మంచి వాసనను ఇవ్వడంతో పాటు ఎన్నో ఆరోగ్య గుణాలను కలిగి ఉంటుంది. దీని వాసన పీల్చడం వలన జలుబు, దగ్గు సమస్య తగ్గుతుంది. పుదీనా తన ఘాటైన వాసనతో శ్వాస సమస్యలకు నివారిస్తుంది. వాములో ఉండే ఘాటైన రసాయనాలు జలుబు, దగ్గు తగ్గించి కఫం కరగడంలో సహాయపడుతుంది.
ఇప్పుడు ఈ నీటిని బాగా మరిగించి పొగలు వస్తున్నప్పుడు ఒక దుప్పటి సహాయంతో ఆవిరిని కొంతసేపు ముక్కుతో, కొంతసేపు నోటితో పీల్చడం వలన శ్వాసనాళాలు శుభ్రపడతాయి. ఊపిరితిత్తుల్లో పేరుకున్న కఫం కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది. జలుబు, దగ్గు సమస్య త్వరగా నివారించబడుతుంది. ఇలా రోజుకు రెండుసార్లు ఆవిరి పట్టాలి. ఇందులో వాడిన పదార్థాలు ఘాటైన వాసనతో శ్వాస నాళాలను శుభ్రపరిచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
ఒకవేళ ఇలా ఆవిరి పట్టలేనప్పుడు ఒక పలుచని క్లాత్లో ఒక నాలుగు లవంగాలు, ఒక స్పూన్ వాము, నాలుగైదు కర్పూరం బిళ్ళలు వేసి వీలైతే కొంచెం దంచి వేసుకోవచ్చు. దీన్ని చిన్న మూటలా కట్టి పెట్టుకోవాలి. తరచూ ఈ పదార్థాలను వాసన చూడడం వలన జలుబు, దగ్గు తగ్గి శ్వాసనాళాలు శుభ్రపడతాయి. ఒకరోజు తర్వాత మళ్లీ తాజాగా ఈ పదార్థాలన్నీ వేసుకుని వాడుకోవచ్చు. ఇది జలుబు వల్ల మూసుకుపోయిన ముక్కును తెరుచుకునేలా చేసి మీకు విశ్రాంతినిస్తుంది.