మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల ప్రతి మనిషికి శరీరంలో చాలా ఎక్కువగా రోగాలు వస్తున్నాయి. వాటిని తగ్గించుకోవడం కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు. సంవత్సరం మొత్తం వచ్చిన ఆదాయంలో సగం వరకు ఖర్చు హాస్పిటల్ కి పెడుతున్నారు. అయినప్పటికీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండట్లేదు. ఆయుర్వేదంలో అనేక రకాల మందులు ఉపయోగించడం వలన శరీరంలో ఉండే అనేక రకాల రోగాలను శాశ్వతంగా తగ్గించుకోవచ్చు.
ఇప్పుడు మనం తెలుసుకోబోయేది అర్జున చెట్టు బెరడు. అర్జున చెట్టు బెరడును ఇంగ్లీష్ మందులలో, ఆయుర్వేదం, అల్లోపతి, నేచురోపతి లో కూడా ఉపయోగిస్తారు. అర్జున్ చెట్టు బెరడు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కషాయం చేసుకుని తాగినట్లయితే శరీరంలో 72 రకాల భయంకరమైన రోగాలు తగ్గిపోతాయి. ఎక్కువ కాలం బ్రతకవచ్చు. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని రెండు అంగుళాల సైజున్న అర్జున చెట్టు బెరడు మూడు ముక్కలను తీసుకుని గిన్నెలో వేసుకోవాలి. దీనిలో రెండు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి.
స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి పావు చెంచా దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. రెండు గ్లాసుల నీళ్ళు ఒక గ్లాసు అయ్యే వరకు నీటిని మరిగించుకోవాలి. తర్వాత నీటిని వడగట్టి ఆ నూనెను గోరువెచ్చగా ఉన్నప్పుడు ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరంలో అనేక రకాల రోగాలు తగ్గిపోతాయి. గుండె జబ్బులు, జీర్ణ సంబంధ సమస్యలు, గ్యాస్టిక్, జలుబు, దగ్గు, జ్వరం వంటి ఎన్నో రకాల రోగాలను తగ్గించుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వు కూడా తగ్గించుకోవచ్చు.
ఎముకల బలహీనత, నరాల బలహీనత, నీరసం, అలసట, కళ్లు తిరగడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ కషాయం రోజుకి ఒక్క గ్లాస్ తాగినట్లయితే మన ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఈ కషాయం చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తాగవచ్చు. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ కషాయాన్ని పూర్వం ఋషులు కూడా ఎక్కువగా ఉపయోగించేవారు. ఎటువంటి ఇంగ్లీష్ మందులు అవసరం లేకుండా శరీరంలో అన్ని రకాల రోగాలను తగ్గించుకోవడం కోసం ఈ కషాయాన్ని తీసుకునేవారు. మీకు అవసరం అనిపిస్తే మీరు కూడా ఈ కషాయాన్ని తయారుచేసుకొని తాగండి. శరీరంలో అనేక రకాల రోగాలు నయమవుతాయి.