కొబ్బరిపువ్వు తింటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి.

సాదారణంగా కొబ్బరికాయను దేవుడి ముందు కొట్టినపుడో లేక వంటల్లో వాడుకోవడానికి కొట్టినపుడో కొబ్బరి కాయ లోపల బెరడు లాగా( స్పాంజి లాగా)  తెల్లగా ఉండే భాగాన్ని కొబ్బరి పువ్వు అంటారు. చాలామంది గ్రామీణ ప్రాంతంలో వారికిఈ కొబ్బరి పువ్వు చాలా సుపరిచితం. ఇంకా కొబ్బరి తోటలు విరివిగా ఉండేవారికి దీని విలువ ఏపాటిదో తప్పక తెల్సి ఉంటుంది. మంచి రుచిని కలిగి ఉండటమే కాదు ఈ కొబ్బరి పువ్వులో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్. మరి కొబ్బరి పువ్వుతో మ్యాజిక్ మ్యాజిక్  హెల్త్ టిప్స్ చూడాల్సిందే.

◆ కొబ్బరి పువ్వును సాధారణంగా పచ్చిగా తింటారు.

కొబ్బరి నీరు మరియు కొబ్బరి  చాలా పోషకమైనవి అని మనందరికీ తెలుసు అయితే కొబ్బరి పువ్వు గూర్చే ఇపుడు తెలుసుకుందాం

◆ఇది యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ప్లమెటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల కొబ్బరి పువ్వును తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా తయారవుతుంది.

◆ శరీరానికి కావలసిన దాతు శక్తిని అందించడంలో కొబ్బరిపువ్వు ఉత్తమంగా పనిచేస్తుంది. శరీర సామర్త్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కండర నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కొబ్బరిపువ్వు తరచుగా తీసుకోవడం వల్ల క్రీడాకారులకు గొప్ప దేహదారుడ్యం సొంతమవుతుంది.

◆ మన శరీరానికి వివిధ ఆహార పదార్థాలనుండి  అందే పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాల జీర్ణక్రియ సమర్థవంతంగా జరగడంలో కొబ్బరిపువ్వు సహకరిస్తుంది. ఇది శరీరం పోషకాలు శోషణ చేసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది.

◆ మధుమేహం ఉన్నవారు కొబ్బరిపువ్వు తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సమతాస్థితిలో ఉండేందుకు దోహాధం చేస్తుంది. అలాగే రక్తంలో చెక్కర స్థాయిలను క్రమబద్దీకరించడంలో తోడ్పడుతుంది.

◆ కాలంతో పాటూ ఎదురయ్యే  వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనంగా ఉండేందుకు కొబ్బరిపువ్వు గొప్పగా పనిచేస్తుంది. మరియు అనారోగ్యంతో ఉన్నవారి శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాన్సర్ కారక కణాలతో పోరాడి కాన్సర్ ను దొకరంగా ఉంచుతుంది.

◆ కొబ్బరి పువ్వులో మంచి కొలెస్ట్రాల్ ఉండటం వల్ల గుండె సంబందిత సమస్యలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరానికి కావలసిన మంచి కొవ్వులను అందించడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అణిచివేస్తుంది.

◆ మహిళల్లో ఎదురయ్యే థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుంది. థైరాయిడ్  గ్రంధి పనితీరును ఆరోగ్యవంతంగా ఉంచడం ద్వారా సమస్యను తొలగిస్తుంది.

◆ విసర్జక వ్యవస్థ యొక్క ముఖ్య స్థావరం అయిన మూత్రపిండాల పనితీరును కొబ్బరి పువ్వు తినడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. మూత్రాశయ సంబంధిత సమస్యలను తగ్గించడం ద్వారా ఎన్నో రకాల జబ్బులను దూరంగా ఉంచవచ్చు.

◆ కొబ్బరిపువ్వులో ఎక్కువ శాతం నీరు మరియు ఫైబర్ ఉండటం మూలాన బరువు తగ్గించడంలో ఉత్తమంగా సహాయపడుతుంది.

◆జుట్టు మరియు చర్మాన్ని ఆరోగ్యంగా మరియు యవ్వనంగా ఉంచడంలో కొబ్బరిపువ్వు సహాయపడుతుంది, అలాగే ముడతలు, చర్మం వడలిపోవడం, కళను కొల్పవడం ను  నిరోదించి చర్మానికి తేమను అందించి మృదువైన, కాంతివంతమైన  చర్మాన్ని అందిస్తుంది.

చివరగా……

కొబ్బరి పువ్వు దొరికినపుడు తప్పకుండా తినడం వల్ల పైన చెప్పుకున్న ఆరోగ్య ప్రయోజనాలను అందరూ పొందవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top